Nalgonda Murder: నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త హత్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం?

Nalgonda Murder: నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య రాజకీయ రచ్చగా మారుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కక్షతోనే తన భర్తను చంపేశారని మృతుడి భార్య ఆరోపిస్తున్నారు.

Written by - Srisailam | Last Updated : Aug 14, 2022, 02:16 PM IST
  • సర్పంచ్ భర్త హత్యపై రచ్చ
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఆరోపణలు
  • నల్గొండ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు
Nalgonda Murder: నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త హత్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం?

Nalgonda Murder:  నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య రాజకీయ రచ్చగా మారుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కక్షతోనే తన భర్తను చంపేశారని మృతుడి భార్య ఆరోపిస్తున్నారు.  తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం సర్పంచి సంధ్య రెడ్డి భర్త విజయ్ రెడ్డి శనివారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. పొలం పనులు ముగించుకొని బైక ఇంటికి వస్తుండగా దుండగులు విజయ్ రెడ్డిని అడ్డగించారు. ముగ్గురు వ్యక్తులు మొదట ఆయన బైక్ ను ఢీకొట్టారు. కిందపడిపోయిన విజయ్ రెడ్డిపై దాడి చేశారు.  కత్తులు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా నరికేశారు. ఈ ఘటనలో స్పాట్ లోనే చనిపోయాడు విజయ్ రెడ్డి. అనంతరం అతని మృతదేహాన్ని కాల్వలో పడేసి వెళ్లిపోయారు దుండగులు.

తన భర్త హత్యపై ఎల్లమ్మ గూడెం సర్పంచ్ సంధ్య తీవ్రమైన ఆరోపణలు చేశారు. మూడు నెలల కింద హైదరాబాద్ ఫంక్షన్ కి వెళ్తే అక్కడ ఎటాక్ చేశారని చెప్పారు. తమకు  ప్రాణహాని ఉందని రెండు నెలల క్రితమే ఎస్పీని కలిశామని తెలిపారు.  తిప్పర్తి పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లామన్నారు. అయినా పోలీసులు  పట్టించుకోలేదని సంధ్యా రెడ్డి ఆరోపించారు. రాజకీయ నాయకుల అండదండలతోనే తన భర్త ను హతమార్చారని చెప్పారు. తన భర్త  హత్య విషయంలో సందీప్ రెడ్డి, సునంద్ రెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హస్తం ఉందని ఆమె ఆరోపించారు. కొన్ని రోజులుగా తమను రాజకీయంగా వేధించారని వెల్లడించారు. గతంలో తమ  గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దే హతమార్చాలని చూశారని.. కాని  గ్రామస్థులు ఉండడంతో వెనక్కి వెళ్లారని తెలిపారు.

2019 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్‌ రెడ్డి భార్య సంధ్య  టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు. తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికలో విజయ్ రెడ్డి పోటీ చేయాలని చూసినా.. ఆయనకు టికెట్ ఇవ్వలేదు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో విజయ్ రెడ్డిని టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కొంత కాలం కాంగ్రెస్‌ లో.. ఇంకొంత కాలం బీజేపీలో పని చేశారు. విజయ్‌రెడ్డి భార్య సంధ్య నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో అధికారులు ఆమెకు చెక్‌పవర్‌ రద్దుచేశారు. ఎమ్మెల్యే కుట్ర పూరితంగానే తమ చెక్ పవర్ రద్దు చేయించారని సంధ్యారెడ్డి దంపతులు ఆరోపిస్తున్నారు. చెక్ పవర్ రద్దుకు నిరసనగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేశారు.ఈ నేపథ్యంలో విజయ్ రెడ్డి దారుణ హత్యకు గురి కావడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తన భర్త విజయ్ రెడ్డి హత్య వెనుక నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సందీప్‌రెడ్డి హస్తం ఉందని సర్పంచ్ ఆరోపిస్తున్నారు. సంధ్యారెడ్డి ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం జిల్లాలో సెగలు రేపుతోంది.

Read also:Rakesh Jhunjhunwala: రాకేశ్ ఝుంఝన్‌వాలా జన్మస్థలం హైదరాబాదే.. ఆయన మొత్తం ఆస్తి ఎంతో తెలుసా?

Read also: TRS MLA COMMENTS:కేసీఆర్ పిలుపు మేరకు దేశానికి స్వాతంత్ర్యం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే విడ్డూరం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News