Jalagam Venkat Rao meets Telangana CEO: నేనే కొత్తగూడెం కొత్త ఎమ్మెల్యేను.. తెలంగాణ సీఈఓను కలిసిన జలగం

MLA Vanama Venkateswara Rao Disqualified: 2018 ఎన్నికల్లో జలగం వెంకట్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయగా వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో 4,139 ఓట్ల తేడాతో విజయం సాధించిన వనమా వెంకటేశ్వర్ రావు ఆ తరువాత చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాటలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

Written by - Pavan | Last Updated : Jul 27, 2023, 02:21 PM IST
Jalagam Venkat Rao meets Telangana CEO: నేనే కొత్తగూడెం కొత్త ఎమ్మెల్యేను.. తెలంగాణ సీఈఓను కలిసిన జలగం

MLA Vanama Venkateswara Rao Disqualified: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు 2018 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్ పత్రాల్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందున ఆ ఎన్నిక చెల్లదని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో వనమా వెంకటేశ్వర రావు తరువాత రెండో స్థానంలో ఓట్లు సొంతం చేసుకున్న జలగం వెంకట్ రావును ఎమ్మెల్యే స్థానానికి అర్హులుగా తెలంగాణ హై కోర్టు ప్రకటించింది. 

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో 2018 డిసెంబర్ 12 నుంచి తనని ఎమ్మెల్యేగా గుర్తిస్తూ గౌరవ హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిందిగా కోరుతూ జలగం వెంకట్ రావు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ని కలిశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా పరిగణించాలని కోరుతూ సీఈఓ వికాస్ రాజ్ కి వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా జలగం వెంకట్ రావు మాట్లాడుతూ, కోర్టు తీర్పుపై తాను కామెంట్ చేయదల్చుకోలేదని.. కానీ తాను ఏం చేశానో తన నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. తన ముందున్న మరో మూడు నెలల్లోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జలగం వెంకట్ రావు స్పష్టంచేశారు. 

అంతకంటే ముందు అసెంబ్లీ సెక్రటరిని కలిసిన జలగం వెంకట్ రావు.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నికల చెల్లనేరదని చెప్పిన హై కోర్టు.. తనని ఎమ్మెల్యేగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తనని కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పరిగణించాల్సిందిగా కోరారు. అసెంబ్లీ స్పీకర్‌తో కూడా తాను ఫోన్‌లో మాట్లాడి విజ్ఞప్తి చేసినట్టు జలగం వెంకట్ రావు మీడియాకు తెలిపారు. పార్టీ పరంగా చూసినా తాను బీఆర్ఎస్ పార్టీని వీడకుండా పార్టీలోనే కొనసాగుతున్నాననని.. పార్టీలో ఉంటూనే పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తున్నానని అన్నారు. 

ఇది కూడా చదవండి : Heavy Rains in Warangal: వరంగల్ ప్రజలకు సీపీ రంగనాథ్ హెచ్చరికలు

2018 ఎన్నికల్లో జలగం వెంకట్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయగా వనమా వెంకటేశ్వర్ రావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలో 4,139 ఓట్ల తేడాతో విజయం సాధించిన వనమా వెంకటేశ్వర్ రావు ఆ తరువాత చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల బాటలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ జలగం వెంకట్ రావు మాత్రం పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. తాజాగా జలగం వెంకట్ రావు మాట్లాడుతూ, కోర్టు తీర్పుపై కామెంట్ చేయనని.. తాను ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నానని చేసిన వ్యాఖ్యలు చూస్తే.. తనకు పార్టీలో ఎవ్వరితోనూ విభేదాలు లేవని, అలాగే తాను ప్రస్తుతానికి వివాదాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ఆయన మాటల్లో అర్థం అవుతోంది.

ఇది కూడా చదవండి : Hyderabad Rains: అర్ధరాత్రి విరుచుకుపడుతున్న వరుణుడు, రేపు ఉదయం వరకూ అతి భారీ వర్షాలు, ఇళ్లలోంచి బయటకు రావద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News