Pawan Kalyan: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత తమ పార్టీ జనసేత పోటీలో ఉంటుంది అని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. అయితే ఇటీవలే నామినేషన్ ప్రక్రియ మొదలు అవడం, తరువాత నేడు చివరి రోజు కావడంతో ఈ మధ్యలోనే పవన్ కల్యాణ్ తన మనసు మార్చుకున్నట్టున్నారు. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.
Also Read | Fact Check: కరోనా టీకా వచ్చిసిందా ? వాట్సాప్ మెసేజ్ లో నిజమెంత?
భారతీయ జనతా పార్టీ ( BJP) అగ్రనేతలు అయిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తో ఇవాళ మధ్యహ్నం సమావేశం అయ్యారు పవన్ కల్యాణ్. ఈ సమావేశం జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలి అని నిర్ణయించుకున్న జనసేన పార్టీ.. ప్రస్తుతం భాజపాతో పోత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తోందని సమాచారం.
Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?
అయితే దీనికి తెలంగాణ భాజపా చీఫ్ బండి సంజయ్ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఎవరితో పొత్తు ఉండబోదు అని స్పష్టం చేశారు. అయితే జనసేన ( Janasena) పార్టీ మాత్రం ఆ విషయంలో బండి సంజయ్ తో మాట్లాడుతాం అని తెలపడంతో గందరగోళం ఏర్పడింది.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికలకు జనసేన దూరం.. బీజేపీకి మద్దతు...