Group-4: ముగిసిన గడువు.. తెలంగాణ గ్రూప్-4 పోస్టులకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు..

Ts Group-4: గ్రూప్-4 పోస్టులకు అప్లై చేసుకోవడానికి నిన్నటితో గడువు ముగిసింది. ఈ పోస్టులకు 9 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 11:11 AM IST
Group-4: ముగిసిన గడువు.. తెలంగాణ గ్రూప్-4 పోస్టులకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు..

Ts Group-4 2023: తెలంగాణ గ్రూప్-4 దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. ఇప్పటి వరకు 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై 1న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది వరకే తెలిపింది. ఈ రిక్రూట్ మెంట్ కింద 8,180 పోస్టులు భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. గ్రూప్-4 పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కుల చొప్పున 300 మార్కులకు ఉంటుంది. 

రాష్ట్రంలో 581 వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. దీని దరఖాస్తు ప్రక్రియ కూడా నిన్నటితో ముగిసింది. దీనికి సంబంధించిన రాతపరీక్ష ఆగస్టు నెలలో జరగనుంది. మరోవైపు తెలంగాణ వైద్యారాగ్యశాఖలో భర్తీ చేయనున్న 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 2930 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 34 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎక్కువగా అనస్థీషియా విభాగంలో 155 పోస్టులు ఉండగా.. వీటికి 332 దరఖాస్తులు వచ్చాయి. 

Also Read: Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో వందే భారత్ ట్రైన్ పరుగులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News