Bandi sanjay: పోలీసులు వర్సెస్ హనుమాన్ భక్తులు.. కరీంనగర్ లో హైటెన్షన్.. అసలేం జరిగిందంటే..?

Karimnagar: కరీంనగర్ లో హనుమాన్ భక్తులు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. హనుమాన్ భక్తులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ మంచిర్యాల చౌరస్తాకు చేరుకుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి తల్వార్ పట్టుకుని, వచ్చి ర్యాలీని ముందుకు పోనివ్వకుండా అడ్డుపడ్డాడు.

Written by - Inamdar Paresh | Last Updated : May 26, 2024, 02:28 PM IST
  • పోలీసు స్టేషన్ ముందు నిరసన చేపట్టిన హనుమాన్ భక్తులు..
  • ఎక్స్ వేదికగా స్పందించిన బండి సంజయ్..
Bandi sanjay: పోలీసులు వర్సెస్ హనుమాన్ భక్తులు.. కరీంనగర్ లో హైటెన్షన్.. అసలేం జరిగిందంటే..?

Karimnagar hanuman rally row bandi sanjay reacts: కరీంనగర్ లో శనివారం రాత్రి హైటెన్షన్ ఘటన చోటు చేసుకుంది. హనుమాన్ మాలను వేసుకున్న భక్తులు.. ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీ మంచిర్యాల చౌరస్తా దగ్గరకు చేరుకుంది. భక్తులంతా మాలను ధరించి, హనుమాన్ డ్రెస్ కోడ్ లో భక్తి పారవశ్యంతో రామ నామంను జరిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఒక్కసారిగా అనుకొని ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి అక్కడికి తల్వార్ పట్టుకుని వచ్చి హనుమాన్ భక్తులతో వాగ్వాదానికి దిగాడు.. ర్యాలీని అడ్డుకొన్నాడు. అక్కడ హనుమాన్ భక్తులకు, అతడికి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త చిలికి, చిలికీ గాలివానలాగా మారింది.  అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగంతకుడు ఒక వర్గానికి చెందిన వాడని ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. రోడ్డు మీద బైఠాయించారు. దీంతో ఆగంతకుడు పారిపోయాడు.

Read more: Romantic Dance: క్లాస్ లో టీచర్ తో స్టూడెంట్ రోమాంటిక్ డ్యాన్స్... చూస్తే తట్టుకోలేరు.. వీడియో వైరల్..

దీనిపై హనుమాన్ భక్తులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి తమ నిరసన చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు హనుమాన్ భక్తులను నచ్చచేప్పే ప్రయత్నం చేశారు.  కానీ హనుమాన్ భక్తులు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.  పోలీసులు కాస్తంతా అతిగా స్పందించారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొందరు హనుమాన్ భక్తులు పోలీసులు వాహనంకు అడ్డుగా నిలబడ్డారు. పోలీసులు వెహికిల్ ను స్పీడ్ గా పొనిచ్చారు.  

ఈ నేపథ్యంలో.. ఒక భక్తుడు వాహనం పట్టుకుని ఉండగా.. కొంత దూరం ఈడ్చుకుని వెళ్లారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని, కొందరిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ  ఘటనలో ఆరుగురు హనుమాన్ భక్తులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. తమ విధులకు అడ్డుతగిలారని వీరిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

తల్వార్ తో అడ్డు పడింది బీజేపీ కార్యకర్తే!..

కరీంనగర్ హనుమాన్ యాత్రలో లాఠీ చార్జీ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్న హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి జయదేవ్ గా పోలీసులు గుర్తించారు. అతను.. స్థానిక బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణకు అనుచరుడు,  బీజేపీ పార్టీ కార్యకర్తగా పోలీసులు గుర్తించారు.  ఇతను రాత్రి హనుమాన్ శోభయాత్రలో కు అడ్డుపడి, కత్తి తిప్పినట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వ్యక్తి అని హనుమాన్ భక్తులను బీజేపీ శ్రేణులు ఉసిగొలిపి రాద్ధాంతం చేశారని సమాచారం. దీనిపై పోలీసులు మాత్రం సీరియస్ గా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Read more: Actress Hema: నేను సింహం.. మీరంతా గుంటనక్కలు.. మరోసారి శివాలెత్తిన నటి హేమ..

ఎక్స్ వేదికగా స్పందించిన బండి సంజయ్..

కరీంనగర్ హనుమాన్ భక్తులపై లాఠీచార్జీ ఘటనపై ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. ఎక్స్ వేదికగా స్పందించారు. భక్తులపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. పోలీసుల అదుపులో ఉన్న హనుమాన్ భక్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News