రేపు నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి.. !! తెలంగాణలో తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన ఉద్యమ  పార్టీ. మలిదశ ఉద్యమానికి నాంది పలికి పురుడు పోసుకున్న పార్టీ.. రేపటి (సోమవారం) తో 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం  పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండోసారి తెలంగాణ అధికార  పీఠాన్ని చేజిక్కించుకుని పాలన సాగిస్తోంది.

Last Updated : Apr 26, 2020, 03:41 PM IST
రేపు నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర సమితి.. !! తెలంగాణలో తెలంగాణ రాష్ట్రసాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన ఉద్యమ  పార్టీ. మలిదశ ఉద్యమానికి నాంది పలికి పురుడు పోసుకున్న పార్టీ.. రేపటి (సోమవారం) తో 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం  పూర్తి చేసుకుంది. ఇప్పుడు రెండోసారి తెలంగాణ అధికార  పీఠాన్ని చేజిక్కించుకుని పాలన సాగిస్తోంది.

కరోనా వైరస్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా పటిష్టంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఈ ప్రభావం టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలపైనా పడింది. రేపు ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రేపు అతికొద్ది మంది సన్నిహితుల మధ్య ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ భవన్ లో రేపు ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమ జరగనుంది. 

మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్బావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలు,  పార్టీ నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. 20 ఏళ్ల కాలంలో పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పుకొచ్చారు. దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఓ దిక్సూచిలా నిలిపేందుకు పార్టీ అహర్నిశలు పని చేస్తోందని తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News