కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ కార్యకర్త !

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ కార్యకర్త ! 

Last Updated : Nov 11, 2018, 07:02 PM IST
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ కార్యకర్త !

డిసెంబర్ 7న తెలంగాణ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న నల్గొండ తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శనివారం నాడు నల్గొండ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పౌరులను, కార్యకర్తలను పలకరిస్తూ ముందుకుసాగిపోతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎదురొచ్చిన ఓ వ్యక్తి అనుకోని షాక్ ఇచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నేత అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ కండువాను కప్పబోయే ప్రయత్నం చేశాడు. అనుకోని పరిణామానికి ఖంగుతిన్న కోమటిరెడ్డి... వెంటనే ఓ అడుగు వెనక్కు వేసి అతడి బారి నుంచి తప్పించుకున్నారు. అనంతరం కార్యకర్తలు అతడిని పక్కకు లాగేయడంతో కోమటిరెడ్డి అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. 

జరిగిన ఘటనపై కోమటిరెడ్డి స్పందిస్తూ.. తనని ఏం చేయాలో అర్థం కాని టీఆర్ఎస్ నేతలు.. ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Trending News