Komatireddy Venkat Reddy on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి పున:ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. దేవుడు సన్నిధిలోనూ కేసీఆర్ నీచపు రాజకీయాలు చేయడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు.
'యాదాద్రి పున:ప్రారంభానికి తెలంగాణ సీఎంవో ప్రోటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పున:ప్రారంభానికి పిలవలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారు. దేవుడి దగ్గర కేసీఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం.' అంటూ కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ (మార్చి 28) యాదాద్రి పున:ప్రారంభోత్సవం నిర్వహించిన సంగతి తెలిసిందే. మిథునలగ్నంలో ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం యాదాద్రి ప్రధాన ఆలయ ప్రవేశం నిర్వహించి గర్భాలయంలో స్వర్ణ ధ్వజస్తంభాన్ని సందర్శించారు. మధ్యాహ్నం 12.20 గంటలకు గర్భాలయంలో మూలవరులను సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. నేటి మధ్యాహ్నం 3 గంటల తర్వాత సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.
కాగా, రూ.1800 కోట్ల వ్యయంతో సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో, ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా యాదాద్రిని నిర్మించారు. ఆధారశిల నుంచి గోపురం పైవరకు పూర్తిగా కృష్ణశిలతో నిర్మించిన ఆలయం ప్రపంచంలో ఇదొక్కడే కావడం విశేషం. యాదాద్రి ఆలయాన్ని సందర్శించే భక్తులు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణానికి దైవ పారవశ్వంలో మునిగిపోతున్నారు.
యాదాద్రి పునఃప్రారంభానికి @TelanganaCMO ప్రొటోకాల్ పాటించలేదు. స్థానిక ఎంపీగా నన్ను పునః ప్రారంభానికి పిలవలేదు.
కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రం ఆహ్వానించింది.
దేవుడు దగ్గర కేసిఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) March 28, 2022
Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి భారీ షాక్.. మరో స్టార్ ప్లేయర్ ఔట్!!
Also Read: Vijay-Puri: విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబోలో మరో మూవీ.. రేపే లాంచింగ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook