Laddu Auction: లడ్డూ గెలుచుకున్న ముస్లిం జంట.. నిమజ్జనంవేళ సంచలనంగా మారిన కేటీఆర్ ట్విట్..

KTR Tweet viral: ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఆసిఫాబాద్ లో గణపయ్య లడ్డును వేలంపాట కార్యక్రమం చేపట్టారు.  దీనిలో ముస్లిం కుటుంబం కూడా పాల్గొనడమే కాకుండా.. ఏకంగా లడ్డును సైతం సొంతం చేసుకున్నరు.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 17, 2024, 05:59 PM IST
  • లడ్డూ వేలంపాటలో పాల్గొన్న ముస్లిం కుటుంబం..
  • వెల్లివిరిసిన మతసామరస్యం
Laddu Auction: లడ్డూ గెలుచుకున్న ముస్లిం జంట.. నిమజ్జనంవేళ సంచలనంగా మారిన కేటీఆర్ ట్విట్..

Muslim family won laddu in auction in asifabad: దేశ వ్యాప్తంగా గణపయ్య నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ఊరు,వాడ, పల్లే, పట్నం తేడాలేకుండా గణేష్ విగ్రహాలను ప్రతిష్టాపనలు చేశారు. తొమ్మిదిరోజుల పాటు.. వినాయక నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. ఎక్కడ చూసిన గణపయ్య విగ్రహాల నిమజ్జనం కోలాహాలం కన్పిస్తుంది. అయితే..గణేష్ ఉత్సవాలు చివరలో ప్రతిఏడాది గణేష్ మండపాల వారు లడ్డును స్వామి వారి చేతిలో పెడుతుంటారు.  

 

అంతేకాకుండా.. తొమ్మిదిరోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఆతర్వాత పదవ రోజు ప్రత్యేకంగా పూజలు చేసి వేలంపాట వేస్తుంటారు. అయితే గణేష్ లడ్డును గెలిచిన వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతుంటారు. కొంత మంతి తమ పొలాల్లో గణపయ్య లడ్డును చల్లుకుంటారు. మరికొందరు తమ ఇళ్లలో లాకర్ లో పెట్టుకుని మరల ప్రసాదంగా తింటారు. ఇంట్లో వాళ్లకు, చుట్టాలకు, స్నేహితులకు గణపయ్య లడ్డును ప్రసాదంగా ఇస్తుంటారు.

ఈ నేపథ్యంలో గణేష్ లడ్డు అంటే.. బాలాపూర్ లడ్డు గురించి చెప్పుకొవాల్సిందే. అయితే.. ఈసారి బాలాపూర్ లడ్డు కూడా అన్నిరికార్డులను తిరగరాసి 30 లక్షలకు వేలంపాట జరిగిందని తెలుస్తోంది. ఈసారి కూడా 30 లక్షల ఒక్క వెయ్యికి కొలను శంకర్‌ రెడ్డి లడ్డూ కైవాసం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో కులమతాలకు అతీతంగా కూడా గణపయ్య ఉత్సవాలను నిర్వహించుకున్నారు. చాలా చోట్ల ముస్లింకుటుంబాలకు సైతం గణేష్  మండపాలను ఏర్పాటు చేశారు.అంతేకాకుండా.. అన్నదానం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్ లో ఒక ముస్లిం ఫ్యామిలీ ఈసారి లడ్డును వేలంపాటలో గెల్చుకుంది. 

పూర్తి వివరాలు..

గణేష్ ఉత్సవ వేడుకల్లో కులమతాలకు అతీతరంగా అందరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో.. ఆసిఫాబాద్ జిల్లా భట్ పల్లిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది.  ఇక్కడ గణేష్ లడ్డును వేలంపాట వేశారు. దీనిలో ముస్లింకుటుంబం కూడా పాల్గొంది. భట్ పల్లికి చెందిన..ఆసిఫ్ తన భార్యతో కలిసి వేలంపాటలో పాల్గొన్నాడు.

Read more: Viral video: కాళీకా అమ్మవారే దిగోచ్చిందా..?.. కోల్‌కతా హత్యాచార ఘటనపై హీరోయిన్ పవర్ పుల్ డ్యాన్స్.. వీడియో వైరల్..

అంతేకాకుండా.. ఏకంగా వేలంపాటలో లడ్డును  రూ.13,216 లకు సొంతం చేసుకున్నాడు.  దీంతో అందరు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణాలో గంగా జమున తహాజీబ్ పాటిస్తారని అన్నారు. అన్ని వర్గాల వారు, కులమతాలకు అతీతంగా సంబరాలు  జరుపుకుంటూ, ఒకరి పట్ల మరోకరు సోదరభావంతో ఉంటారని అన్నారు. అదే విధంగా లడ్డు గెల్చుకున్న ఆసిఫ్ కు కంగ్రాట్స్ చెప్పారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News