KTR's Plan for Revanth Reddy: రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు కేటీఆర్ వేసిన ప్లాన్ మీద నీళ్లు చల్లిన వరుణుడు

KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. 

Written by - Pavan | Last Updated : Jul 21, 2023, 01:33 AM IST
KTR's Plan for Revanth Reddy: రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు కేటీఆర్ వేసిన ప్లాన్ మీద నీళ్లు చల్లిన వరుణుడు

KTR's Plan for Revanth Reddy: ఇటీవల తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి పెను మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేవలం 3 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తుందనే విషయాన్ని రైతుల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నెల 17వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పల్లెల్లో రైతు వేదికల వద్ద రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పార్టీ శ్రేణులను సూచించిన సంగతి తెలిసిందే. 

అలాగే అన్ని ప్రాంతాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టి ఉచిత విద్యుత్ పంపిణి విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ఎండగట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు స్పష్టంచేశారు. ఈ నిరసన కార్యక్రమాలు, రైతు సమావేశాలతో రైతులను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేయడం ద్వారా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గట్టి దెబ్బ కొట్టాలని మంత్రి కేటీఆర్ ప్లాన్ చేశారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తల్చినట్టుగా బీఆర్ఎస్ రైతు సమావేశాలకు కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ చేపట్టదల్చిన వరుస నిరసన కార్యక్రమాలకు కానీ తావు లేకుండా గత మూడు, నాలుగు రోజులుగా వరుణుడు విరుచుకుపడుతున్నాడు.

తెలంగాణ రాష్ట్రం నలుమూలలా అనేక ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎవ్వరూ ఇంట్లోంచి కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఓవైపు నాట్లు, విత్తనాలు వేస్తోన్న సమయం.. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలతో రైతులకే దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బిఆర్ఎస్ రైతు నిరసనలు వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు విధానానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత రైతులందరికీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ మూడు గంటల ఉచిత విద్యుత్ విధానాన్ని ఎండగట్టేలా నిరసన కార్యక్రమాలను పార్టీ కొనసాగిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు, రైతులకు ఈ వారం రోజులపాటు అందుబాటులో ఉండి అండగా నిలబడాల్సిందిగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Trending News