హైదరాబాద్ నీటి కష్టాలపై ఎదురైన ప్రశ్నకు కేటీఆర్ రియాక్షన్ ఇదే

హైదరాబాద్ నీటి కష్టాలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్

Last Updated : Jul 17, 2019, 02:31 PM IST
హైదరాబాద్ నీటి కష్టాలపై ఎదురైన ప్రశ్నకు కేటీఆర్ రియాక్షన్ ఇదే

హైదరాబాద్ లో తాగు నీటి కొరత ఏర్పడబోతుందని ఓ ప్రముఖ మీడియా ప్రచురించిన కథకం తెగ చర్చకు దారి తీసింది. ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ దర్శకుడు మారుతీ ఏకంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.  హైదరాబాద్ కు 48 రోజులకు సరిపడా మాత్రమే తాగు నీరుందని ఆపై కష్టాలు తప్పవని వస్తున్న వార్తల్లో నిజమెంతా అని ప్రశ్నించారు. 

స్పష్టత ఇచ్చిన కేటీఆర్
దర్శకుడు మారుతీ ప్రశ్నకు టీఆర్ఎష్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. హైదరాబాద్ లో నీటి కొరత ఏర్పడతుందనే  రిపోర్ట్‌ కచ్చితమైనది కాదని.. నగరానికి అలాంటి పరిస్థితి రాదని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి కొన్ని రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుందని... దీంతో హైదరాబాద్‌ కు 172 ఎంజీడీల నీరు అందుతుందన్నారు.

నీటి కష్టాలపై ఆందోళన వద్దు...
హైదరాబాద్ నీటి కష్టాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..నగరంలో తాగు నీటి సమస్య ఉత్పన్నం కాబోదని నగరవాసులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో నగర పౌరులంతా నీటి పొదుపున విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

 

Trending News