రూ.100 కోట్ల పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

రూ.100 కోట్ల పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

Updated: Nov 13, 2019, 09:20 PM IST
రూ.100 కోట్ల పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
File photo

హైదరాబాద్: కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు రూ. 100 కోట్ల విలువైన అభివృద్ది ప‌నుల‌ను రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు గురువారం ప్రారంభించ‌నున్నారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌తో క‌లిసి రూ. 9.34 కోట్ల వ్య‌యంతో చిత్తార‌మ్మ‌న‌గ‌ర్‌ బ‌స్తీలో నిర్మించిన 108 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి ప్రారంభించ‌నున్నారు. 

అంతేకాకుండా రూ.5.65 కోట్ల వ్య‌యంతో కూక‌ట్‌ప‌ల్లి 6వ ఫేజ్‌లో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని, కూక‌ట్‌ప‌ల్లి 3వ ఫేజ్‌లో రూ. 2.78 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఆధునిక ఫిష్ మార్కెట్‌ను ప్రారంభిస్తారు. కైత‌లాపూర్‌లో రూ. 83.06 కోట్ల వ్య‌యంతో నిర్మించ‌నున్న రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌కు సైతం మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేయనున్నారు.