కేసీఆర్ ను ఎలాగైనా గద్దె దించాలనే వ్యూహంతో తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ ఏకమౌతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్,టీడీపీ, సీపీఐ, కోదండరాం పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయాలని భావిస్తున్నాయి. తాజా పరిణామాలతో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు నేతలు క్యూకడుతున్నారు. ఈ ప్రాంతంలో టీడీపీ పూర్తిగా తుడుచిపెట్టుకుపోయినప్పటికీ కేడర్ మాత్రం చెక్కుచెదరకుండా ఉందని టాక్. ఈ నేపథ్యంలో కేడర్ సహకారం, మహా కూటమితో లబ్ది పొంది గెలవచ్చనే ఆలోచనతో నేతలు ముందుకు రావడంతో తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ అమాంతంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు 60 మందికిపైగా నేతలు మందుకు వచ్చినట్లు తెలిసింది.అవకాశమిస్తే పోటీ చేసేందుకు సిద్ధమని చంద్రబాబుకు దృష్టికి తీసుకెళ్లి పార్టీ వర్గాల నుంచి టాక్.
మహాకూటమిలో కాంగ్రెస్ 90 స్థానాల్లోనూ.. టీడీపీ 20 స్థానాల్లోనూ.. సీసీపీ, కోదండరాం పార్టీ చెరో నాల్గు స్థానా్లో పోటీ చేయాలని ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. టీడీపీ కూడా మహాకూటమిలో చేరి ఉమ్మడిగా పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో టికెట్ ఆశిస్తున్న వారందరికీ సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అందరికీ సీట్లు ఇవ్వలేమని.. మహాకూటమితో సీట్ల సర్దుబాటు తర్వాత తమకు కేటాయించిన సీట్లు మాత్రమే ఇవ్వగలనని ఆశావహులకు చంద్రబాబు వర్తమానం పంపినట్లు తెలిసింది. అయితే వీరిలో కొందరికీ మాత్రం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది
చంద్రబాబు నుంచి హామీ పొందిన వారిలో కోరుట్ల నుంచి ఎల్ రమణ, అనపర్తి నుంచి రావుల చంద్రశేఖర్, పరకాల నుంచి రావూరి ప్రకాశ్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి పెద్దిరెడ్డి, సత్తిపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య, దేవరకద్ర నుంచి దయాకర్ రెడ్డి, బోదన్ నుంచి అమర్ నాథ్ బాబు, ఆర్మూర్ నుంచి అన్నపూర్ణ, నిజామాబాద్ నుంచి మండా వెంకటేశ్వర్వరావు, జడ్చర్ల నుంచి ఎర్రశేఖర్, కోదాడ నుంచి మలయ్యయాదవ్, ఆలేరు నుంచి నర్సిరెడ్డి, కొత్తగూడం నుంచి కూనేరు సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు ఉన్నారు. వీరితో పాటు హైదరాబాద్ నగరానికి చెందిన పలవురు ఆశావహులకు టికెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.