PM Modi Tour In Warangal: విశ్వాస ఘాతకుడు కేసీఆర్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు: ప్రధాని మోదీ

PM Modi Warangal Tour Live Updates: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ నేడు తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. వరంగల్ జిల్లాలో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి వరంగల్ పర్యటన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 8, 2023, 03:36 PM IST
PM Modi Tour In Warangal: విశ్వాస ఘాతకుడు కేసీఆర్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు:  ప్రధాని మోదీ
Live Blog

PM Modi Warangal Tour Live Updates: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటనకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ వారణాసి నుంచి బయలుదేరారు. హైదరాబాద్‌ శివారులోని హకీంపేట్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకోగా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వరంగల్ మామునురుకు చేరుకున్నారు. అనంతరం భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

8 July, 2023

  • 15:35 PM
  • 14:08 PM
  • 13:00 PM

    ==> విశ్వాస ఘాతకుడు కేసీఆర్: ప్రధాని మోదీ
    ==> కేసీఆర్ అవినీతి దేశవ్యాప్తంగా విస్తరించారు 
    ==> తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు 
    ==> కేంద్ర నిధులతో తెలంగాణ గ్రామాల్లో అభివృద్ధి 
    ==> కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకు పోయింది 
    ==> తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అవినీతి మయం చేశారు 
    ==> తెలంగాణ ఆర్ధిక వ్యవస్తను చిన్నా భిన్నం చేశారు 
    ==> కాంగ్రెస్ అవినీతిని దేశమంతా చూసింది 
    ==> తెలంగాణ వర్సిటీల్లో మూడువేల అధ్యాపక పోస్టులు భర్తీ చేయలేదు 
    ==> 15 వేల టీచర్ పోస్టులు ఖాళీ 
    ==> తెలంగాణ ఆకాంక్షను అమలు చేసింది బీజేపీనే 
    ==> బీఆర్ఎస్, బీజేపీ అడ్రస్ గల్లంతు 
    ==> ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు తుడిచి పెట్టుకుపోతాయి 

  • 12:46 PM

    ==> తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అవినీతి రాష్ట్రమంతా తెలుసు: ప్రధాని మోదీ
    ==> కాంగ్రెస్ అవినీతి దేశమంతా తెలుసు
    ==> తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి
    ==> తెలంగాణలో కేంద్ర నిధులను గ్రామపంచాయతీలకు చేరకుండా పక్కదారి పెట్టిస్తున్నారు
    ==> నిరుద్యోగులు మోసపోయారు
    ==> టీఎస్‌పీఎస్‌ స్కామ్‌తో ఎంతో నష్టపోయారు
    ==> నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇవ్వలేదు
    ==> దళితులతోపాటు అన్ని వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోంది.

     

  • 12:37 PM

    ==> తెలంగాణ ప్రభుత్వం ఇన్ని రోజులు ఏం చేసింది: మోదీ 
    ==> గత తొమ్మిదేళ్లలో నాలుగే పనులు చేసింది
    ==> తెలంగాణ ప్రాజెక్టుల్లో ప్రతీది అవినీతిమయమే..
    ==> కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది..
    ==> తెలంగాణలో బీఆర్ఎస్‌ అవినీతిని పెంచి ప్రోత్సహించింది.
    ==> కేసీఆర్ కుటుంబ స్కాముల్లో కూరుకుపోయింది
    ==> కుటుంబ అభివృద్ధికే కేసీఆర్ పరితపిస్తారు
    ==> పొద్దున లేస్తే కేంద్రాన్ని తిట్టడమే బీఆర్ఎస్ ప్రభుత్వం పని

     

  • 12:30 PM

    ==> వరంగల్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉంది: ప్రధాని మోదీ
    ==> భద్రకాళి మహత్యం, సమ్మక్క-సారక్క పౌరుషం, రాణిరుద్రమ పరాక్రమం అంటూ ప్రసంగం
    ==> ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం ఉంది
    ==> మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ ట్రైలర్ చూపించింది
    ==> వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌-కాంగ్రెస్‌ను అడ్రస్ లేకుండా చేయాలి.
    ==> కాజీపేట వ్యాగన్ యూనిట్ రైల్వేల విస్తరణకు ఎంతో తోడ్పడుతుంది
    ==> ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఎంతో ఉంది

  • 12:21 PM

    ప్రధాని స్పీచ్‌లోని హైలెట్స్

    ==> తెలంగాణ ప్రజలందరికీ నా అభినందలు అంటూ తెలుగులో ప్రసంగం మొదలు 
    ==> ఆర్థికాభివృద్ధిలోనూ తెలంగాణదే ప్రధాన భూమిక
    ==> గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్ ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు 
    ==> నేడు రూ.6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించడం సంతోషంగా ఉంది
    ==> తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతాం.. 
    ==> రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డు సృష్టిస్తున్నాం..
    ==> దేశాభివృద్ధి కోసం పనులు శరవేగంగా పూర్తి చేస్తాం..
    ==> తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుంది.

  • 12:08 PM

    ==> ప్రపంచమే మోదీని బాస్‌గా గుర్తించింది: బండి సంజయ్
    ==> ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ ఈ సభకు రాలేదు
    ==> అభివృద్ధి చేసేందుకే మోదీ తెలంగాణకు వచ్చారు
    ==> మోదీ నా భూజం తట్టారు.. అంతకన్నా అదృష్టం ఏముంది..
    ==> కిషన్ రెడ్డి నేతృత్వంలో కుటుంబ, అవినీతి పాలనను తరిమికొడతాం..
    ==> ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ సభకు రాలేదు..?

  • 12:04 PM

    ఉత్తర తెలంగాణకు నేడు శుభసూచికం: ఈటల రాజేందర్
    బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే..
    కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు..
    ఆరునూరైనా వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే..

  • 11:58 AM

    హన్మకొండలో బీజేపీ భారీ బహిరంగ సభ ప్రారంభమైంది.
     

  • 11:27 AM
  • 11:12 AM

    ప‌్రధాని మోదీ ప్రత్యేక పూజలు

     

  • 11:11 AM

    భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ప్రధాని మోదీ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకున్నారు.
     

  • 11:00 AM

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేటెస్ట్ ట్వీట్

     

  • 10:59 AM
  • 10:56 AM

    ప్రధాని మోదీ ఈ పర్యటనలో భాగంగా రూ.6,109 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రతిష్ఠాత్మక వ్యాగన్ తయారీ ఫ్యాక్టరీ, పలు జాతీయ రహదారులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం వరంగల్‌ వేదికగా జరిగే విజయ సంకల్పసభలో మోదీ ప్రసంగించనున్నారు.
     

Trending News