Telangana Budget Live Updates: 24 గంటలు కరెంట్‌పై భట్టి ప్రకటన.. నవ్వుకున్న కేసీఆర్

Telangana Budget 2024 Live Announcements: ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్‌ను నేడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి ప్రవేశపెట్టనుంది. ప్రతిపక్ష నేత హోదాలో మాజీ సీఎం కేసీఆర్ మొదటిసారి సభకు హాజరవుతారని వార్తల నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 25, 2024, 01:55 PM IST
Telangana Budget Live Updates: 24 గంటలు కరెంట్‌పై భట్టి ప్రకటన.. నవ్వుకున్న కేసీఆర్
Live Blog

Telangana Budget 2024 Live Announcements: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీ ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేడు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరిలో నెలలో రూ.2.75 లక్షల కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. ఈ సారి రూ.2.80 లక్షల కోట్ల నుంచి రూ.2.90 లక్షల కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఆయన సభకు హాజరైతే ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి వచ్చినట్లవుతుంది. తెలంగాణ బడ్జెట్ లైవ్‌ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

25 July, 2024

  • 13:54 PM

    Telangana Budget 2024 Live: రాష్ట్రంలో నిరంతరాయంగా 24 గంటల కరెంటు ఇస్తున్నామని  భట్టి అనగానే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూస్తూ మాజీ సీఎం కేసీఆర్ నవ్వుకున్నారు.

  • 13:49 PM

    Telangana Budget 2024 Live Updates: తెలంగాణ తలసరి ఆదాయం 3,47,299 రూపాయలుగా ఉంది. 
    ==> తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి అప్పు రూ.75,577 కోట్లు ఉండగా.. గతేడాది డిసెంబర్ నాటికి అప్పు రూ.6.71 లక్షల కోట్లకు చేరింది.

  • 13:10 PM

    Telangana Budget 2024 Live Updates: 

    ==> మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టంకు రూ.50 కోట్లు
    ==> మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కోసం రూ.1500 కోట్లు 

  • 12:49 PM

    Telangana Budget 2024 Live Updates:

    ==> మహిళా శక్తి క్యాంటిన్ - రూ.50 కోట్లు
    ==> హైదరాబాద్ అభివృద్ధి- రూ.10 వేల కోట్లు
    ==> జీహెఎంసీ- రూ.3 వేల కోట్లు
    ==> హెచ్ఎండీఏ- రూ.500 కోట్లు
    ==> మెట్రో వాటర్- రూ.3,385 కోట్లు
    ==> హైడ్రా- రూ.200 కోట్లు
    ==> ఎయిర్‌ పోర్ట్‌కు మెట్రో- రూ.100 కోట్లు
    ==> ఓఆర్ఆర్- రూ.200 కోట్లు
    ==> హైదరాబాద్ మెట్రో- రూ.500 కోట్లు
    ==> ఓల్డ్ సిటీ మెట్రో- రూ.500 కోట్లు
    ==> మూసీ అభివృద్ధి- రూ.1,500 కోట్లు
    ==> రీజినల్ రింగ్ రోడ్డు- రూ.1,500 కోట్లు
    ==> ఎస్సీ ,ఎస్టీ సంక్షేమం- రూ.17,000 కోట్లు
    ==> మైనారిటీ సంక్షేమం- రూ.3 వేల కోట్లు
    ==> బీసీ సంక్షేమం- రూ.9,200 కోట్లు
    ==> విద్యుత్-రూ.16,410

  • 12:44 PM

    Telangana Budget 2024 Live Updates:

    ==> వ్యవసాయం - రూ.72,659 కోట్లు
    ==> హైదరాబాద్ నగర అభివృద్దికి రూ.10 వేల కోట్లు
    ==> విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
    ==> హార్టికల్చర్- రూ.737
    ==> మహాలక్ష్మి ఉచిర రవాణా-రూ.723
    ==> పంచాయతీ రాజ్-రూ.29,816

  • 12:37 PM

    Telangana Budget 2024 Live Updates:
    ==> రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు
    ==> పశుసంవర్ధక శాఖకు రూ.1,980 కోట్లు
    ==> గృహజ్యోతికి రూ.2,418 కోట్లు
    ==> ఐటీ శాఖకు రూ.774 కోట్లు
    ==> ట్రాన్స్‌కో, డిస్కలంకు రూ.
    ==> ఉద్యానవనం- రూ.737 కోట్లు
    ==> హోంశాఖకు రూ.9,564 కోట్లు
    ==> పశుసంవర్దకం-రూ. 1,980 కోట్లు
    ==> పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు
    ==> అడవులు, పర్యావరణ శాఖకు రూ.1,064 కోట్లు

     

  • 12:36 PM

    Telangana Budget 2024 Live Updates:
    ==> రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు
    ==> పశుసంవర్ధక శాఖకు రూ.1,980 కోట్లు
    ==> గృహజ్యోతికి రూ.2,418 కోట్లు
    ==> ఐటీ శాఖకు రూ.774 కోట్లు
    ==> ట్రాన్స్‌కో, డిస్కలంకు రూ.
    ==> ఉద్యానవనం- రూ.737 కోట్లు
    ==> హోంశాఖకు రూ.9,564 కోట్లు
    ==> పశుసంవర్దకం-రూ. 1,980 కోట్లు
    ==> పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు
    ==> అడవులు, పర్యావరణ శాఖకు రూ.1,064 కోట్లు
    ==> వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468
    ==> మైనార్టీ శాఖకు రూ.3,003

  • 12:28 PM

    Telangana Budget 2024 Live Updates:

    ==> రూ.500 గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు
    ==> వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు
    ==> మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు

  • 12:24 PM

    Telangana Budget 2024 Live: సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు
    ==> విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు
    ==> ప్రజా పంపిణీకి రూ.2836
    ==> సంక్షేమానికి రూ.40 వేల కోట్లు

  • 12:13 PM

    Telangana Budget 2024 Live: తెలంగాణ రెవెన్యూ వ్యయం: రూ.2,20,945 కోట్లు
    మూలధన వ్యయం: రూ.33,487 కోట్లు

  • 12:11 PM

    Telangana Budget 2024 Live: రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

  • 12:05 PM

    Telangana Budget 2024 Live: నా తెలంగాణ.. కోటి రతనాల వీణ అంటూ మహాకవి దాశరథి కవితతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.

  • 12:03 PM

    Telangana Budget 2024 Live: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగం మొదలైంది.

  • 11:54 AM

    Telangana Budget 2024 Live News: మరికాసేపట్లో శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • 11:07 AM

    Telangana Budget 2024 Live News: తెలంగాణ బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

  • 10:00 AM

    Telangana Budget 2024 Live News: ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ సమావేశం...

    ==> అసెంబ్లీ కమిటీ హాల్ లో కేబినెట్ భేటి

    ==> హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు

    ==> తెలంగాణ బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్

  • 09:57 AM

    Telangana Budget 2024 Live News: రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కింద ప్రభుత్వం లక్ష వరకు రుణాల మాఫీకి రూ.6 వేల కోట్ల విడుదల చేసింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు చెబుతున్నారు. మరీ రుణమాఫీకి బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయిస్తుందో చూడాలి మరి.

  • 09:57 AM

    Telangana Budget 2024 Live News: రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కింద ప్రభుత్వం లక్ష వరకు రుణాల మాఫీకి రూ.6 వేల కోట్ల విడుదల చేసింది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు చెబుతున్నారు. మరీ రుణమాఫీకి బడ్జెట్‌లో ఎన్ని నిధులు కేటాయిస్తుందో చూడాలి మరి.

  • 09:51 AM

    Telangana Budget 2024 Live News: తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీకి చేరుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఆయన అసెంబ్లీ హాల్‌లోని చాంబర్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.

  • 09:11 AM

    Telangana Budget 2024 Live News: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. నేడు భట్టి విక్రమార్క అసెంబ్లీ బడ్జెట్ సమర్పించనుండగా.. రేపు సభకు సెలవు ప్రకటించారు. 

  • 09:08 AM

    Telangana Budget 2024 Live News: రేవంత్ సర్కారు బడ్జెట్‌పై తెలంగాణ ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీలకు నిధుల కేటాయింపు ఎలా ఉంటుంది..? రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు ఉంటాయనేది ఆసక్తి నెలకొంది.
     

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x