తెలంగాణలో "మహా కూటమి" పేరును మార్చేశారు

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌, టిడిపి, టిజెఏసి, సిపిఐ పార్టీలు "మహా కూటమి"ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Last Updated : Oct 13, 2018, 10:46 PM IST
తెలంగాణలో "మహా కూటమి" పేరును మార్చేశారు

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌, టిడిపి, టిజెఏసి, సిపిఐ పార్టీలు "మహా కూటమి"ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు "మహా కూటమి" పార్టీ పేరును మార్చాలని ఈ కూటమి సభ్యులందరూ తీర్మానించారు. "ప్రజా కూటమి"గా కూటమి పేరును మారుస్తున్నట్లు తెలిపారు. గతంలో మహాకూటమికి ఆశించిన ఫలితం లభించకపోవడంతోనే ఆ పేరులో మార్పును చేసినట్లు తెలుస్తోంది.

అదే విధంగా "ప్రజా కూటమి" పేరుతో ఏర్పాటు చేసుకున్న కూటమిలో భాగంగా.. రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు చేస్తామని ఈ కూటమి సభ్యులు తెలిపారు. ఈ కూటమి సమావేశానికి కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు తెలుగుదేశం నేత ఎల్.రమణ,  టీజేఎసీ నేత కోదండరామ్ తదితరులు హాజరయ్యారు. కాగా.. టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఈ ప్రజాకూటమి పై ఘాటైన విమర్శలు చేశాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ పార్టీ.. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి విరుద్ధంగా కాంగ్రెస్‌తో కలవడం విడ్డూరంగా ఉందని  మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రజల కష్టాలను ఎప్పడూ పట్టించుకోలేదని, వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. ఈ కూటమి మాటలు నమ్మశక్యంగా లేవని.. అయినా ఈ విషయంలో తమకు ప్రజల పై నమ్మకం ఉందని.. వారే తగిన బుద్ధి చెబుతారని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. 

Trending News