Free Bus Ticket: మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి జీరో టికెట్ జారీ చేస్తోంది. మహిళల కోసం ఈనెల 9 మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అప్పటి నుంచి మహిళలు బస్సులో ఉచితంగా ప్రయానిస్తున్నా, వారికి ఎలాంటి టికెట్ లేదు. అయితే దీని కారణంగా ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయిందన్న లెక్కలు తెలుసుకోవడం కోసం ఈ జీరో టిక్కెట్ ను అమలు చేస్తున్నారు. జీరో టికెట్ పై ఎలాంటి చార్జీ లేదని తెలుపడానికి సున్నా సంఖ్య చూపిస్తుంది. దీంతో పాటు మహిళలు ఎక్కడ నుంచి ఎంత దూరం వరకు ప్రయాణిస్తున్నారు అనే వివరాలు టికెట్‌లో నమోదవుంది. దీంతో అంతదూరం ప్రయాణానికి వాస్తవంగా వసూలు చేసే టికెట్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. దీని ఆధారంగా ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది.
జీరో టిక్కెట్ జారీ చేసే టీమ్స్‌ల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రయోగాత్మకంగా గురువారం కొన్ని డిపోల్లో జీరో టిక్కెట్లను జారీ చేసింది. దీంతో ప్రక్రియ పూర్తి కావటంతో నేటి నుంచి అన్ని డిపోల పరిధిలో జీరో టికెట్‌ను అమలు చేయాలని అర్టీసీ ఎండీ సజ్జనార్ ఆమోదం తెలిపారు.
బస్సులో ప్రయాణం చేస్తున్నారు వీటిని తప్పకుండా మీతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే...
ఉచిత బస్సు ప్రయాణం చేసేవారు తమ వద్ద ఎదైన ఒక్క గుర్తింపు కార్డును బస్ కండక్టర్‌కు కచ్చితంగా చూపించాలి. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా మీ ఆధర్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, లేదా నివాస ప్రాంతాన్ని తెలిపే ఏదైన కార్డును చూపించాల్సి ఉంటుంది.
ఒరిజినల్ కాకపోయిన వాటి జిరాక్స్ కాపీలు చూపించినా సరిపోతుందని అధికారులు తెలిపారు. పొరపాటున ఎవరైనా గుర్తింపు కార్డు ఇవాళ మరిచిపోతే , మరోసారి జీరో టికెట్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాలని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు.
Also Read: Telangana High Court: జనవరిలో హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన.. 100 ఎకరాల్లో నిర్మాణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి