Minister KTR: ప్రధాని మోదీ వరంగల్‌ టూర్‌ను బహిష్కరిస్తున్నాం.. ఏం మొహం పెట్టుకుని వస్తున్నారు: కేటీఆర్

KTR Calls For Boycott of PM Modi Warangal Tour: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్‌కు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 7, 2023, 01:31 PM IST
Minister KTR: ప్రధాని మోదీ వరంగల్‌ టూర్‌ను బహిష్కరిస్తున్నాం.. ఏం మొహం పెట్టుకుని వస్తున్నారు: కేటీఆర్

KTR Calls For Boycott of PM Modi Warangal Tour: బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి  మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఉజ్వలమైన భవిష్యత్‌ ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల కేసీఆర్‌ను ఎంతగానో కలచివేసిందన్నారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని.. వారి యోగక్షేమాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికిపైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం దాదాపు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామని తెలిపారు. కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటామన హామీ ఇచ్చారు. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. 2014లో ప్రధాని పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రధానమంత్రి తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న వ్యక్తి అని అన్నారు. తెలంగాణ పట్ల విషాన్ని నింపుకున్న ప్రధాన మంత్రికి.. తెలంగాణ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకో తెలియదన్నారు. గుజరాత్‌లోని దహోడ్‌లో 20 వేల కోట్ల రూపాయలతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని.. కానీ రాష్ట్ర పునర విభజన హామీ అయినా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి మాత్రం మొండి చేయి చూపించారని అన్నారు. ప్రధానమంత్రి బూటకపు మాటలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు.

"ఇదే వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ హామీని ఇప్పటి దాకా నెరవేర్చని ప్రధానమంత్రి ఏ మొహం పెట్టుకొని వరంగల్‌కు వస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పిన ప్రధానమంత్రి ఆ హామీని నెరవేర్చలేదు. తొమ్మిదేళ్లపాటు కాలయాపన చేసిన ప్రధానమంత్రి ఇప్పుడు తెలంగాణకు 520 కోట్ల రూపాయలతో బిచ్చం వేసినట్లు వస్తున్నారు.  తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు నమ్మరు. మతం పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టిన ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు. 
ప్రధాని పర్యటనను పూర్తిగా బహిష్కరిస్తున్నాం.. 

ధరణి విదేశీ చేతిలో ఉందన్న రేవంత్ రెడ్డి గుర్తించాల్సిన మాట.. కాంగ్రెస్ పార్టీ కూడా విదేశీ చేతుల్లోనే ఉంది. రేవంత్ రెడ్డి నోట్లోన్చి వేలకోట్ల మాట తప్ప ఇంకో మాట రాదు. ఆయనకు మతిస్థిమితం లేదు. ఇది సెక్రటేరియట్ కింద వేల కోట్లు ఉన్నాయని చేసిన పిచ్చి ఆరోపణలు అందరికీ గుర్తుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీపైన ఒక మాట ఎందుకు మాట్లాడడు..? మోడీని బీజేపీని ఒక మాట అనకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అందుకే గాంధీ భవన్‌లో గాడ్సే దూరిండు అని మేము చెప్పాము. రేవంత్ రెడ్డి 100 శాతం ఆర్ఎస్ఎస్ మనిషి, బీజేపీ మనిషి.." అని కేటీఆర్ అన్నారు.

రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సైతం అందించి విచారణ చేయించుకోవచ్చన్నారు. ధరణి ద్వారా జరిగిన లబ్ధిని తాము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా ప్రజలకు చెప్తామని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్ రెడ్డి.. ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ అయితే ఓర్వలేక పోతున్నారని విమర్శఙంచారు. ఆయనన భూ దందాలు ధరణి ద్వారా సాధ్యమవుతలేదనే అక్కసుతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 

నాలుగేళ్ల కింద మోదీని పచ్చి బూతులు తిట్టిన చంద్రబాబునాయుడు ఎన్‌డీఏ మీటింగ్ ఎలా హాజరవుతారని ప్రశ్నించారు కేటీఆర్. గత నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్‌కు మోడీ చేసిన మేలు ఏమిటో చంద్రబాబు చెప్పాలన్నారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణకు మోడీ చేసిన మేలు ఏమిటో చెప్పి హాజరు కావాలని అన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ దేశానికి ఏం చేసిండో అదైనా చెప్పాలన్నారు. 

Also Read: Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి భారీ షాక్.. పిటిషన్‌ కొట్టివేసి గుజరాత్ హైకోర్టు    

Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News