Hakimpet Sports School OSD Suspended: హైదరాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో లైంగిక వేధింపుల ఘటన సంచలనం రేకిత్తిస్తోంది. విద్యార్థులను పట్ల ఓ అధికారి ఓ అధికారి అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ మినిస్టర్ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించిన వార్త తనను ఎంతగానో కలిచివేసిందని ట్విట్టర్లో రాసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదని.. సంబంధిత అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి.. బాధిత విద్యార్థునులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వెంటనే స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆభివృద్ది, సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. క్రీడాకారిణిలకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు వారిలో ధైర్యం నింపేందుకు వెంటనే చర్యలను చేపట్టామని అన్నారు. గతంలో మహిళల పట్ల జరిగిన లైంగిక వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు మంత్రి. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కించపరిచే విధంగా మాట్లాడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన ఘటనపై వచ్చిన వార్త కథనంపై అధికారిక నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పోర్ట్స్ స్కూలు ఓఎస్డీని తక్షణం సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటనపై మూడు రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నారు.
ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తమకు ఈరోజు ఉదయం 7 గంటలకు సమాచారం అందిందని.. గంటల వ్యవధిలోనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తప్పు చేసినట్లు తేలితే జైలు అధికారిని జైలుకు పంపిస్తామని.. అవసరం అయితే ఉరితీయిస్తామంటూ మంత్రి కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. వాస్తవ నివేదిక సమర్పించాలని ఐదుగురు సభ్యుల కమిటీని నియమించామన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: Telangana Politics: బీజేపీకి బిక్ షాక్.. కీలక నేత గుడ్‌బై
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి