Metro Route Change: మెట్రో అలైన్‌ మెంట్‌ లో స్వల్ప మార్పులు, కసరత్తు చేస్తున్న ప్రభుత్వం..?

Metro Route Change:  మెట్రో రెండో దశలో భాగంగా నిర్మించే బీహెచ్‌ఈఎల్‌ లక్డికాపూల్‌ మార్గంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అలైన్‌ మెంట్‌ లో స్వల్ప మార్పులు చేయాలని చూస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 09:15 PM IST
  • మెట్రో రెండో దశ ప్రతిపాదిత మార్గంలో మార్పులు
  • అలైన్‌ మెంట్‌ లో స్వల్ప మార్పులు చేసే అవకాశం
  • కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
 Metro Route Change: మెట్రో అలైన్‌ మెంట్‌ లో స్వల్ప మార్పులు, కసరత్తు చేస్తున్న ప్రభుత్వం..?

Metro Route Change: హైదరాబాద్‌ మెట్రో నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలకు కొంతమేర పుల్‌ స్టాప్‌ పడింది. ఈ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టంతో హైదరాబాదీలు గంటల తరబడి ట్రాఫిక్‌ లో కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా పోయింది. భారతదేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రో నెట్‌ వర్క్‌ హైదరాబాద్‌దే. ఢిల్లీ మెట్రో 285 స్టేషన్లు, హైదరాబాద్‌ మెట్రో 57 స్టేషన్లను కలిగి ఉంది. పబ్లిక్‌ ప్రైవేటు పార్ట్‌ నర్‌ షిప్‌ పద్ధతిలో నిర్మించిన ఈ మెట్రో నవంబర్‌ 29 2017 నుంచి ఆపరేషన్స్‌ ప్రారంభించింది. తొలి దశలో మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌, రాయదుర్గం నుంచి నాగోల్‌, జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రో సేవలు అందిస్తోంది. తొలిదశ మెట్రో మంచి సక్సెస్‌ సాధించడంతో రెండో దశపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రెండో దశ నిర్మాణాకి అయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌ ను డీపీఆర్‌ తయారుచేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రెండో దశలో 58 కిలోమీటర్ల మార్గానికిగానూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌ అధికారులు డీపీఆర్‌ ను సిద్ధం చేశారు. దీన్ని మూడు దశలుగా నిర్మించాలని ప్రతిపాదించారు.

అయితే బీహెచ్‌ఈఎల్‌ లక్డికాపూల్‌ మార్గంపై గతంలో ఢిల్లీ మెట్రో అధికారులు ఇచ్చిన నివేదికలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అలైన్‌ మెంట్‌ లో మార్పులు చేసి ఈ మార్గం నిర్మించాలని చూస్తోంది. బీహెచ్‌ఈఎల్‌ లక్డికాపూల్‌ మార్గంలో ప్రభుత్వం కొత్తగా అనేక ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌ లు నిర్మించింది. వీటివల్ల మైట్రో లైన్‌ నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తోంది. అయితే ఫ్లైఓవర్లు నిర్మించిన స్థలంలో మెట్రో పిల్లర్లు మరింత ఎత్తున నిర్మించాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రభుత్వానికి ఖర్చు మరింత పెరగనుంది. అదికాక  ఫ్లైఓవర్ల పక్కనే పిల్లర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అలా చేస్తే కొద్ది నెలల పాటు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవు. అసలే కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే సాఫ్ట్‌ వేర్‌ ఆఫీస్‌ లు తిరిగి పునఃప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూట్‌ అలైన్‌ మెంట్‌ పై ఫోకస్‌ పెట్టింది.

బీహెచ్‌ఈఎల్‌ లక్డికాపూల్‌ రూట్‌ లో తొలుత బీహెచ్‌ఈఎల్‌, మదీనాగూడ, హఫీజ్‌ పేట్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ జంక్షన్‌, షేక్‌ పేట్‌, రేతిబౌలి, మెహదీపట్నం, లక్డికాపూల్‌ వరకు రూట్‌ డిజైన్‌ చేశారు. ఈ మార్గంలో 22 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రో కార్పొరేషన్‌  అధికారులు ప్రతిపాదించింది. బీహెచ్‌ఈఎల్‌ మెట్రో డిపో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం 70 ఎకరాల స్థలం కూడా కేటాయించింది. అయితే ఈ రూట్‌ లోనే కొత్తగా అనేక అండర్‌ పాస్‌లు, ఫ్లైఓవర్లు నిర్మాణమయ్యాయి.  అయితే ఈ రూట్‌ మారిస్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రెండో దశ మెట్రో లైన్‌ వస్తుందనే ఆశలతో కొండాపూర్‌, హఫీజ్‌ పేట్‌, మదీనాగూడతో పాటు చాలా ప్రాంతాల్లో రియల్‌ బూమ్‌ వచ్చింది. అంతేకాకుండా ఈ రూట్‌  నుంచి నిత్యం వేలాది మంది వారివారి పనుల కోసం మెహదీపట్నం మీదుగా లక్డికాపూల్‌ వరకు వెళ్తుంటారు. చాలీచాలనీ బస్సు సర్వీసులతో గంటల తరబడి ట్రాఫిక్‌ జాంలతో ఇన్నాళ్లూ ఇబ్బందులు పడ్డ అక్కడి ప్రజలకు మెట్రో వస్తుందన్న వార్త కొంత ఊరటనిచ్చింది. మళ్లీ ఈలోగా ప్రభుత్వం రూట్‌ అలైన్‌ మెంట్‌ చేంజ్‌ ప్లాన్‌ చేస్తుంది. మరి దీనిపై హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Also Read: Konaseema District Protests Live Updates: కోనసీమ జిల్లా పేరు మార్పుతో భగ్గుమన్న అమలాపురం.. మంత్రి ఇంటికి, వాహనాలకు నిప్పు

Also Read: Justin Bieber india tour : అక్టోబర్‌లో జస్టిన్ బీబర్ భారత్ టూర్.. టికెట్లు కావాలంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News