జీఈఎస్ సదస్సులో ఇవాంకాతో మోడీ భేటీ

భారత్‌కు చెందిన నీతి ఆయెగ్‌ మరియు అమెరికా ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీఈఎస్ సదస్సు ప్రారంభమవ్వక ముందు ప్రధాని మోడీ, అమెరికా సలహాదారు ఇవాంక ట్రంప్‌తో కొద్దిసేపు భేటీ అయ్యారు

Last Updated : Nov 28, 2017, 04:32 PM IST
జీఈఎస్ సదస్సులో ఇవాంకాతో మోడీ భేటీ

భారత్‌కు చెందిన నీతి ఆయెగ్‌ మరియు అమెరికా ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీఈఎస్ సదస్సు ప్రారంభమవ్వక ముందు ప్రధాని మోడీ, అమెరికా సలహాదారు ఇవాంక ట్రంప్‌తో కొద్దిసేపు భేటీ అయ్యారు. మోడీని కలవక ముందు విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ను ఇవాంకా గౌరవప్రదంగా కలిశారు.  "మహిళలే ప్రథమం- అందరికీ శ్రేయస్సు" అనే నినాదంతో ఈ సదస్సు ప్రారంభమవనుంది.

 

 

సాయంత్రం నాలుగున్నర గంటలకు అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకాతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీ వద్దకు ప్రతినిధులు చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమ ఈ సదస్సుకు హాజరయ్యే ఇవాంకా ప్రధాని ఫలక్‌నామాలో అందించే ప్రత్యేక విందుకు కూడా హాజరు కానున్నారు. 

 

 

 

 

Trending News