Mystery Deaths: జగిత్యాల జిల్లాలో విషాదం.. ఒకే చెరువులో ముగ్గురు యువతుల మృతదేహాలు

జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. ఒకే చేరువులో ముగ్గురు యువతులు ఆత్మహత్యకు పాలపడ్డారు, ఇద్దరు యువతుల మృతదేహాలు లభ్యం అవగా.. మరో మృతదేహం దొరకాల్సి ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 05:14 PM IST
  • జగిత్యాల జిల్లాలో దారుణం
  • ఒకే చెరువులో ముగ్గురు యువతులు ఆత్మహత్య
  • దొరికిన రెండు మృతదేహాలు.. మరో యువతి కోసం సెర్చింగ్
Mystery Deaths: జగిత్యాల జిల్లాలో విషాదం.. ఒకే చెరువులో ముగ్గురు యువతుల మృతదేహాలు

Mystery Deaths Jagtial District: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురి యువతులు ఒకేసారి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో (Jgityala District) చోటుచేసుకుంది. గుట్ట సమీపంలో ఉన్న ధర్మసముద్రం చెరువులో యువతులు ఆత్మహత్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ముగ్గురు యువతులు ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం స్థానికులను విస్మయానికి గురి చేస్తుంది. 

చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు యువతులు జగిత్యాల జిల్లాలోని గాంధీనగర్ కు చెందిన వారుగా గుర్తించారు. మృతి చెందిన వారు వందన (Vandana), మల్లిక (Mallika), దేవి (Devi)గా గుర్తించారు. ఇందులో దేవి, మల్లికల మృత దేహాలు లభ్యం అవగా... వందన మృత దేహం దొరకాల్సి ఉంది. 

Also Read: Hardship of Life: ప్రపంచం కంట కన్నీరు పెట్టిస్తున్న ఫోటో.. గుండె బరువెక్కించే సన్నివేశం

అయితే మృతి చెందిన ఇద్దరు యువతులకు వివాహం అవ్వగా.. మరో యువతి ఇంటర్ చదువుతోంది. వీరి శవాలు చెరువులో తేలియాడటం గమనించిన స్థానికులు ఆందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వగా మృతదేహాలను వెలికితీశారు.  తప్పిపోయిన మరో యువతి మృతదేశం గురించి వెతుకుతున్నారు. అకస్మాత్తుగా చెరువులో రెండు శవాలను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. 

కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యప్తు జరుపుతున్నారు. ఈ ముగ్గురు యువతులకు ఎలా పరిచయం..?? వేరువేరుగా చనిపోయారా..?? లేక ముగ్గురు ఒకేసారి చనిపోయారా..?ఎవరైనా చంపేసి చెరువులో పడేసి వెళ్ళారా? అనే కొనాలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Also Read: Actress Pragathi: తీన్మార్‌ స్టెప్పులతో దుమ్ములేపిన ప్రగతి..వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News