Tirupati special Train: నాందేడ్ నుంచి స్పెషల్ ట్రైన్ కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట మీదుగా తిరుపతికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. దీంతో శ్రీవారి దర్శనాలకు వెళ్లాలనుకునే భక్తులుపండగ చేసుకుంటున్నారు.
Dharmapuri Lakshmi Narasimha Swamy Idol Found: ధర్మపురి గోదావరి నది తీరంలో జాలర్లకు ఇసుక తిన్నెల్లో సుమారు మూడు అడుగుల ఎత్తు ఉన్న పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య మంగళ విగ్రహం లభ్యమైంది. బయటకు తీసిన విగ్రహానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు.
Jagtial Central University: జగిత్యాల జిల్లాలో ప్రతిష్టాత్మక కేంద్ర విశ్వవిద్యాలయం శంకుస్థాపన వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అత్యంత ఘనంగా సాగుతున్న ఈ సభా ప్రాంగణంలోకి అకస్మాత్తుగా పాములు ప్రవేశించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Jagtial Municipal Scam: జగిత్యాల మున్సిపాలిటీలో భారీ ఫోర్జరీ కుంభకోణం వెలుగుచూసింది. ఆన్లైన్ విధానాన్ని పక్కనబెట్టి.. హార్డ్ కాపీల ద్వారా ఏకంగా మున్సిపల్ కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేసి రిజిస్ట్రేషన్లు చేసిన ఉదంతం కలకలం రేపుతోంది.
Jagtial Telugu News: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGPEJAC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ జగిత్యాల TGNPDCL డివిజన్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు.
Jagtial Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయానికి (KV) కనీసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ CM రేవంత్ రెడ్డిని కోరారు. ప్రభుత్వం ఇటీవల కేటాయించిన 5 ఎకరాల స్థలం కేవలం ప్రాథమిక తరగతులకే సరిపోతుందని.. భవిష్యత్తు విస్తరణ, ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీలతో పాటు ప్లే గ్రౌండ్స్ ఏర్పాటుకు కనీసం 10 ఎకరాలు అవసరమని ఆయన స్పష్టం చేశారు..
Jagtial 2BHK Housing Row: జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుల ప్రక్రియ తీవ్ర గందరగోళానికి దారితీసింది. కండిషన్స్‌పై మున్సిపల్ అధికారులు లబ్ధిదారుల నుంచి గుడ్డిగా సంతకాలు సేకరిస్తున్నారంటూ.. బాధితులు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ఆందోళనకు దిగారు.
Dharmapuri Arvind: జగిత్యాల జిల్లాలో శుక్రవారం ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. అంతేకాకుండా వివిధ అంశాలపై మాట్లాడారు..
Jagtial Collector Satya Prasad: మేడిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపు పిల్లలకు పాఠాలు కూడా చెప్పారు. అలాగే పిల్లతో మధ్యహ్నన భోజనం కూడా చేశారు.
Jagtial RTC Bus Drivers Strike News: జగిత్యాల డిపోలో అద్దె బస్సులకు సంబంధించిన డ్రైవర్లు మెరుపు ధర్నాకు దిగారు. దీంతో జగిత్యాల బస్ స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే సర్వీస్‌లన్నీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. డ్రైవర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే వరకు వారు సర్వీసులు మొదలయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది..
RTC Driver Paddy Issue: పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అడ్లురి లక్ష్మణ్, జగిత్యాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుబస్టాండ్ సమీపంలో రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. ఇంతలో డ్రైవర్ అశోబస్సును డ్రైవింగ్ చేస్తు..మొదటవడ్లు కొనాలని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారంగా మారాయి. దీనిపై ఆర్టీసీ అధికారులు జగిత్యాల డిపో డ్రైవర్ కు ఊహించని షాక్ ఇచ్చారు.
Jagtial Wine Shop Flexie: జగిత్యాల జిల్లాలోని గొల్లపెల్లి మండలంలో ఒక వైన్ షాప్ ఎదుట అద్భుతమైన సమాచారం అందించే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. రైతులంతా సన్నబడ్లు వేయాలని ఫ్లెక్సీలో పేర్కొనడం విశేషం..
Jagtial Kendriya Vidyalaya Row: జగిత్యాల పరిసర ప్రాంతమైన చల్లగల్లో కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించాల్సిన భూమిని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కావాలని ఆపుతున్నారని ఎంపి ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. అయితే ఇదే అంశంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా స్పందించారు..
Kondagattu Seethamma Bavi: ప్రతిరోజు కొండగట్టు అంజన్నకు కేవలం సీతమ్మ బావి నుంచి తీసిన నీటిని మాత్రమే అభిషేకానికి వినియోగిస్తూ ఉంటారు. అసలు ఈ సీతమ్మ భావి ఎక్కడుంది.. హనుమంతుడికి ఈ జలాలతోనే అభిషేకం చేయడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Karimnagar Heatwave Alert: రాష్ట్రవ్యాప్తంగా ఎండల వేడి తీవ్రత పెరుగుతూ వస్తోంది. కొన్ని చోట్లనైతే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలోని కొన్ని చోట్ల 44 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Jeevan reddy: జగిత్యాల బీఆర్ఎస్ నేత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. అంతే కాకుండా కేసీఆర్ గొప్ప విజన్ ఉన్న నేతగా చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలని ప్రజలు భావిస్తున్నట్లు చెప్పారు.
KCR Praja Ashirvada Sabha Meeting Top 10 Highlights In Jagtial: జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్రంగా నిలవనుంది. గులాబీ బాస్, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంచలన ప్రసంగం చేశారు. రాజకీయాల్లో ప్రకంపనలు రేపనున్న ఈ బహిరంగ సభకు సంబంధించిన టాప్ 10 పాయింట్లు ఇవే.
KCR Announces I Will Not Die BRS Party Will Come Back To Power: కాంగ్రెస్ ప్రభుత్వానికి గులాబీ బాస్ కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ప్రకటించారు. జగిత్యాల సభా వేదికగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం పేరు ఎత్తకుండా విమర్శలు చేయడం గమనార్హం. కేసీఆర్ పూర్తి ప్రసంగం ఇలా..
KCR Mentions TRS Again: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నోట మరోసారి టీఆర్ఎస్ పేరు వినిపించింది. సోమవారం జగిత్యాలలో సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిక సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ ప్రసంగించారు. తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ దే మళ్లీ అధికారం.. పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుని బాధ్యత నాది అంటూ గులాబీ అధినేత సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నోట మరోసారి టీఆర్ఎస్ అనే పదం రావడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
Ex CM KCR Sensational Speech In Jagtial BRS Party Meeting Live Updates: తెలంగాణ రాజకీయాల్లో రేపు పెను మార్పు ఉండనుందా? జగిత్యాల నుంచి కేసీఆర్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందా? దాదాపు ఏడాది తర్వాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఏం మాట్లాడనున్నారనేది ఉత్కంఠ నెలకొంది. జగిత్యాల సభ లైవ్ అప్డేట్స్ ఇవే..
Brs mla Sanjay kumar fires on brs kcr: జీవన్ రెడ్డి పార్టీలో చేరడం హరీష్ రావుకు ఇష్టంలేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా మాట్లాడటం తెలంగాణ రాజకీయల్లో హాట్ టాపిక్ గా మారింది.
KCR: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సుదీర్ఘ విరామం తర్వాత ప్రజల్లోకి వస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల అనంతరం గులాబీ బాస్ ప్రజల మధ్యకు రాకపోవడం, అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంతో.. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో జగిత్యాల వేదికగా ఆయన నిర్వహించబోయే బహిరంగ సభ తన ఉనికిని చాటుకోవడమే కాకుండా.. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తన ప్రాధాన్యతను నిరూపించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.