Jupally Krishna Rao: నానా హడావుడి సృష్టించి.. రేవ్ పార్టీ అని ఊదరగొట్టిన మీడియా.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఊహించని రీతిలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన చేశారు. ఆ పార్టీలో లిక్కర్ మాత్రమే లభించిందని చెప్పి సంచలనం రేపారు. ఆయన ప్రకటనతో పార్టీలో డ్రగ్స్ వినియోగించలేదని స్పష్టమైంది. ఈ మేరకు జూపల్లి కృష్ణారావు చేసిన ప్రకటనతో కేటీఆర్ బావ మరిది పార్టీ వివాదం తొలగినట్టుగా కనిపిస్తోంది. డ్రగ్స్ అని ఊదరగొట్టిన ప్రత్యర్థులకు చెంపపెట్టులా మంత్రి ప్రకటన ఉంది.
హైదరాబాద్ శివారులోని జన్వాడ గ్రామ పరిధిలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ బావ మరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి ఓ పార్టీ జరిగిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. అయితే రేవ్ పార్టీ జరిగిందని పూర్తి తప్పుడు ప్రచారం జరగడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన నేపథ్యంలో ఆదివారం రాత్రి తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.
'ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిపై స్పందించి అధికారులు సోదాలు చేయడం సాధారణం. చట్టం ఎవరికీ చుట్టం కాదు. విశవాసనీయ సమాచారం అందడంతో ఎస్‌ఓటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు. సాధారణ ప్రక్రియలో భాగంగానే అధికారులు సోదాలు చేశారు' అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఫామ్ హోస్‌లో వేడుకలకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఈవెంట్ అనుమతి తీసుకోలేదని స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా మద్యం పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (విదేశీ మద్యం) ఎస్‌ఓటీ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని వివరించారు. దిగుమతి చేసుకున్న లిక్కర్ కు డ్యూటీ ఫ్రీ బిల్స్ చూపించలేదని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో కేటీఆర్ బావ మరిది నివాసంలో డ్రగ్స్ లేవని స్పష్టమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి