Telangana Budget Sessions: బడ్జెట్ సమావేశాలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Telangana Budgest Sessions Without Governor Speech: గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 07:19 PM IST
  • బడ్జెట్ సమావేశాలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
  • ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు..!
  • మార్చి 7న ప్రారంభం కానున్న సమావేశాలు..
Telangana Budget Sessions: బడ్జెట్ సమావేశాలపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Telangana Budgest Sessions Without Governor Speech: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. కానీ ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండా.. తొలిరోజే బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సోమవారం (ఫిబ్రవరి 28) ప్రగతి భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో 2014, 1970లలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 

గత కొద్దిరోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతోన్న సంగతి తెలిసిందే. అలాగే కొత్త రాజ్యాంగం కావాలనే ప్రతిపాదనను కూడా ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ తాజా నిర్ణయం వెనుక ఈ రెండు కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా గవర్నర్‌కు ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మేడారం జాతరకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజ్‌భవన్‌తో ప్రగతి భవన్‌కు గ్యాప్ పెరగడం వల్లే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది.

ఇదే అంశంపై ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారని తాను అనుకోవట్లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ తప్పనిసరిగా శాసనసభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుందన్నారు. రెండు సందర్భాల్లో గవర్నర్ శాసనసభను ఉద్దేశించి ప్రసంగించాలని ఆర్టికల్ 176లో పొందుపరిచారని పేర్కొన్నారు. ప్రతీ ఏటా మొదటి శాసనసభా సమావేశంలో గవర్నర్ తప్పనిసరిగా ప్రసంగిస్తారని చెప్పుకొచ్చారు. గవర్నర్ స్పీచ్, ఆ స్పీచ్‌కు ధన్యవాద తీర్మానం, తీర్మానంపై చర్చకు సమయం కేటాయించాల్సిందిగా రాజ్యాంగంలో పొందుపరిచి ఉందని అన్నారు. కాబట్టి గవర్నర్ స్పీచ్ లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని.. ప్రభుత్వం ఆ పనిచేయబోదని అన్నారు. కాగా, మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6న కేబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. 

Also Read: Asus 8z Launched: ఇండియాలో లాంచ్ అయిన ఆసస్ 8 జెడ్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే..

AP Assembly Budget Session: చంద్రబాబు లేకుండా అసెంబ్లీలో ఆ కీలకమైన బిల్లులు, రాజధాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News