EX CM KCR: కేసీఆర్‌ రీ ఎంట్రీకి.. ముహూర్తం ఫిక్స్‌!

Kcr back to Assembly: గులాబీ బాస్‌ కేసీఆర్‌ కొద్దిరోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయ్యారు..!  అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకు వచ్చారు..! కానీ గులాబీ బాస్‌ రీ ఎంట్రీ కోసం యావత్‌ రాష్ట్రం ఎదురుచూస్తోంది..! కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలకు అయినా కేసీఆర్‌ వస్తారా..! ఈ విషయంలో బీఆర్‌ఎస్ నేతలు ఏమంటున్నారు..!

Written by - G Shekhar | Last Updated : Dec 6, 2024, 08:30 PM IST
EX CM KCR: కేసీఆర్‌ రీ ఎంట్రీకి.. ముహూర్తం ఫిక్స్‌!

Kcr back to Assembly: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పొలిటికల్‌ రీ ఎంట్రీపై సస్పెన్స్ నడుస్తోంది. కొద్దిరోజులుగా ఫామ్‌హౌస్‌కే పరిమితం అయినా గులాబీ బాస్‌.. ఇప్పుడైనా బయటకు వస్తారా..! లేదంటే ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారా అనే చర్చ జరుగుతోంది. ఈనెల 9 నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాంతో కేసీఆర్ రాక కోసం బీఆర్‌ఎస్ పార్టీతో పాటు.. కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుచూస్తోంది.! ఇప్పటికే కేసీఆర్‌ అసెంబ్లీ రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి పదేపదే డిమాండ్‌ చేస్తున్నారు. కానీ కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తారా.. లేదా అనే విషయంలో మాత్రం గులాబీ లీడర్లు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారట. కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయ్యేది లేనిది తమకు కూడా తెలియదని చెబుతున్నారు..

ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోంది. దాంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు జరుపుతోంది. ఆరు గ్యారెంటీల అమలు, రైతు రుణమాఫీతో అనేక అంశాలపై ప్రచారం చేసుకుంటోంది. అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై మాజీమంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు స్పీడ్‌ పెంచారు. రేవంత్ రెడ్డి టార్గెట్‌గా పంచ్‌ డైలాగ్‌లతో విరుచుకుపడుతున్నారు.  కానీ కేసీఆర్‌ లేని లోటును మాత్రం ఈ ఇద్దరు నేతలు తీర్చలేకపోతున్నారట. ఈ విషయంలో పార్టీ నేతలందరిదీ ఒకేమాటగా ఉందట. కేసీఆర్ వస్తేగానీ ఈ సమస్య తీరదని చెబుతున్నారట.. అందుకే నేతలంతా ముక్తకంఠంతో గులాబీ బాస్‌ జనంలోకి రావాలని కోరుతున్నారట. కొద్దిరోజులుగా కేసీఆర్‌ను కలిసిన నేతలు.. కూడా బాస్‌ను ప్రజల్లోకి రావాలని కోరుతున్నారట.. అయితే నేతల అభిప్రాయాలు విన్న కేసీఆర్‌ మాత్రం.. రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఓ ఏడాది సమయం ఇద్దాం.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయని పక్షంలో ఇప్పుడు తమ తడఖా చూపిద్దామని చెప్పి పంపించారట.. అయితే కేసీఆర్‌ ఇచ్చిన గడువు దగ్గర పడింది. దాంతో అధినేత ఇప్పుడైనా రీ ఎంట్రీ ఇస్తారా లేదా అని క్యాడర్‌ మొత్తం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే గులాబీ బాస్‌ ప్రజక్షేత్రం వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన గులాబీ బాస్‌... అసెంబ్లీ సమావేశాల్లో ఏమీ మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఆ తర్వాత మీడియా పాయింట్‌లో మాత్రం రెండు నిమిషాలు సంబషించారు. అయితే మరోసారి డిసెంబర్‌ 9 నుంచి అసెంబ్ల సమావేశాలు మరోసారి జరగబోతున్నాయి. దాంతో అసెంబ్లీకి కేసీఆర్‌ వస్తారా.. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తారా..! లేదంటే కేటీఆర్‌, హరీశ్‌ రావునే చూసుకోమని వదిలేస్తారా అనేది చూడాల్సి ఉందంటున్నారు సొంత పార్టీ లీడర్లు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఊవ్విళ్లూరుతున్నారు. కేసీఆర్‌ అసెంబ్లీ వచ్చి పదేళ్ల పాలనపై వివరణ ఇవ్వాలని అంటున్నారు. అలాగే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుతున్నారు. అయితే సీఎం రేవంత్‌ రెడ్డి ఆఫర్‌పై కేసీఆర్‌ సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.. ఒకవేళ కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే.. సభ సజావుగా జరుగుతుందా.. లేదంటే గులాబీ బాస్‌ను అవమానిస్తారా అనే చర్చ సైతం జరుగుతోందట..

మొత్తంగా కేసీఆర్ రీ ఎంట్రీ కోసం సొంత పార్టీ లీడర్లకు ఓ క్లారిటీ లేదని తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం.. అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగుతున్నాయి అంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కాంగ్రెస్‌ పార్టీ ఏడాది పాలనపై లోతైన చర్చ జరిగే అవకాశం ఉందట.. అంతేకాదు.. మూసీ, హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉంది..ఈ అంశాన్ని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఓ అస్త్రంలా వాడుకునే చాన్స్‌ ఉందని చెబుతున్నారు.. మొత్తంగా గులాబీ బాస్‌ రీ ఎంట్రీపై మాత్రం పార్టీ నేతలు కూడా ఓ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారట. అయితే కేసీఆర్ రాక కోసం కాంగ్రెస్‌ పార్టీ కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది.

Also Read: Padi Kaushik Reddy: మళ్లీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉగ్రరూపం.. బంజారాహిల్స్‌ సీఐతో రచ్చరచ్చ

Also Read: Telangana Liquor Prises: మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News