/telugu/photo-gallery/daggubati-purandeswari-demands-to-ys-jagan-must-give-declaration-while-visiting-tirumala-temple-on-28th-september-rv-167258 YS Jagan Declaration: తిరుమలలో వైఎస్‌ జగన్‌ అడుగు పెట్టాలంటే అది చేయాల్సిందే! పురంధేశ్వరి ఛాలెంజ్‌ YS Jagan Declaration: తిరుమలలో వైఎస్‌ జగన్‌ అడుగు పెట్టాలంటే అది చేయాల్సిందే! పురంధేశ్వరి ఛాలెంజ్‌ 167258

Telangana E Challan: వాహనాల చలాన్ల ఆదాయం తెలంగాణకు భారీగా వచ్చింది. పెండింగ్‌ చలాన్ల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తోంది. రాయితీలు ఇవ్వడం వలన పెద్ద ఎత్తున వాహనదారులు తమ చలాన్లు చెల్లిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉండగా.. ఇప్పటివరకు 1,52,47,864 మంది తమ చలాన్లు చెల్లించారు. అయితే ఇది మొత్తం 42.38 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. చెల్లించిన చలాన్ల ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఆ ఆదాయం వచ్చింది.

పెండింగ్‌ చలాన్లపై తెలంగాణ పోలీస్‌ శాఖ రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌ 27వ తేదీ నుంచి రాయితీలతో చలాన్లు చెల్లించాలని నిర్ణయించింది. 15 రోజుల పాటు రాయితీలపై చెల్లింపులకు అవకాశం కల్పించింది. అయితే చలాన్ల చెల్లింపులు ఆశించినంత రాకపోవడంతో గడువు తేదీని పొడిగించారు. సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో జనవరి 31వ తేదీ వరకు పొడిగిస్తూ పోలీస్‌ శాఖ నిర్ణయం తీసుకుంది. పొడిగించిన తేదీ నాలుగు రోజుల్లో ముగియనుంది. చలాన్లు మీ సేవ, పేటీఎం, టీ వ్యాలెంట్‌, నెట్‌బ్యాకింగ్‌ ద్వారా చెల్లించాలని పోలీసులు సూచిస్తున్నారు. రెండు సార్లు గడువు పొడిగించినా కూడా వాహనదారుల నుంచి స్పందన నామమాత్రంగా కనిపిస్తోంది.

ముందుకు రాని వాహనదారులు
రాయితీలు కల్పిస్తున్నా వాహనదారులు ముందుకురావడం లేదు. ఇప్పటికే రెండుసార్లు గడువు ప్రకటించగా 42 శాతం మాత్రమే చలాన్లు చెల్లించారు. వాహనదారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మరోసారి గడువు పొడిగింపు ఉంటుందని భావిస్తున్నారేమో అలాంటిదేమీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. ఈసారి చెల్లించాల్సిందేనని చెప్పారు. రాయితీల గడువు ముగిశాక చలాన్లపై ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పెండింగ్‌ చలాన్లు ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

రాయితీలు ఇలా
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు 90, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ఇచ్చారు.

ఆదాయం ఇలా..
హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.34 కోట్లు, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రూ.25 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో రూ.16 కోట్ల ఆదాయం వచ్చింది.

Also Read: Harish Rao: 'గ్యారంటీ'ల అమలుకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెడలు వంచాలి: హరీశ్‌ రావు పిలుపు

Also Read: Bihar: రేపే బిహార్ సీఎం నితీశ్‌ రాజీనామా? ఎన్డీయేలో చేరడం లాంఛనమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
No More Date Extension to E Challan Discount Says Telangana Police Rv
News Source: 
Home Title: 

E Challan: వాహనదారుల్లారా అలర్ట్‌.. గడువు లేదు మిత్రమా ఇంకా నాలుగు రోజులే

E Challan: వాహనదారుల్లారా అలర్ట్‌.. గడువు లేదు మిత్రమా ఇంకా నాలుగు రోజులే
Caption: 
Traffic Challan Pending (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
E Challan: వాహనదారుల్లారా అలర్ట్‌.. గడువు లేదు మిత్రమా ఇంకా నాలుగు రోజులే
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Saturday, January 27, 2024 - 22:51
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
23
Is Breaking News: 
No
Word Count: 
277