Dubbaka bypoll result 2020: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే అందుకు నిదర్శనం పవన్ కల్యాణ్

Dubbaka bypoll results 2020: దుబ్బాకలో విజయం సాధించిన బీజేపి అభ్యర్థి రఘునందన్ రావుకు ( Raghunandan Rao ) ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ తరపున అభినందనలు తెలిపారు. దుబ్బాకలో బీజేపి అభ్యర్థి విజయానికి కృషిచేసిన ఆ పార్టీ నాయకత్వానికి సైతం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) శుభాభినందనలు తెలియజేశారు.

Last Updated : Nov 10, 2020, 09:20 PM IST
Dubbaka bypoll result 2020: దుబ్బాక ఉప ఎన్నిక ఫలితమే అందుకు నిదర్శనం పవన్ కల్యాణ్

Dubbaka bypoll results 2020: దుబ్బాకలో విజయం సాధించిన బీజేపి అభ్యర్థి రఘునందన్ రావుకు ( Raghunandan Rao ) ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ తరపున అభినందనలు తెలిపారు. దుబ్బాకలో బీజేపి అభ్యర్థి విజయానికి కృషిచేసిన ఆ పార్టీ నాయకత్వానికి సైతం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) శుభాభినందనలు తెలియజేశారు. బీజేపి పట్ల అక్కడి ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం ఓ నిదర్శనంగా పవన్ కల్యాణ్ అభివర్ణించారు. బీజేపిలో తెలంగాణ ( BJP in Telangana ) పార్టీకి అధ్యక్షుడిగా ఎంపికైనప్పటి నుంచి దుబ్బాక ఉప-ఎన్నిక వరకు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay ) చూపిన నాయకత్వ పటిమే విజయానికి బాటలు వేసిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపి విజయం గురించి ప్రస్తావిస్తూ.. రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజా సేవ చేయాలనే చిత్తశుద్ధి, నిబద్ధతే ఆయనకు విజయాన్ని అందించిందని అభిప్రాయపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలో యువకులు విశేష సంఖ్యలో పాల్గొనడం శుభపరిణామంగా పేర్కొంటూ రాజకీయాలను సన్మార్గంలో నడిపించడం యువత వల్లే సాధ్యపడుతుందని అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక ( Dubbaka byelection 2020 ) విజయంలో పాల్పంచుకున్న ప్రతీ ఒక్కరికి పవన్ కల్యాణ్ అభినందనలు తెలియజేశారు.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x