KCR JAIL: కేసీఆర్ కోసం కరీంనగర్ జైలులో గది! పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు..

KCR JAIL: బండి సంజయ్ కామెంట్లతో రంగంలోకి దిగింది కాంగ్రెస్. బీజేపీ నేతలకు షాకిచ్చింది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సోమవారం ఉదయం కరీంనగర్ జైలుకు వెళ్లింది.

Written by - Srisailam | Last Updated : Aug 29, 2022, 11:37 AM IST
  • కరీంనగర్ జైలుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు
  • కేసీఆర్ గది చూపించాలన్న పొన్నం
  • కొత్త గది ఏమి లేదన్న అధికారులు
KCR JAIL: కేసీఆర్ కోసం కరీంనగర్ జైలులో గది! పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు..

KCR JAIL:  తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో రోజురోజుకు వేడెక్కుతోంది. హాట్ కామెంట్లతో కాక రేపుతున్నారు లీడర్లు. తెలంగాణలో దూకుడుగా వెళుతోంది బీజేపీ. ఆ పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో జోరుగా పర్యటిస్తున్నారు. నెల రోజుల్లోనే ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించగా.. ఈనెల 27న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. హన్మకొండలో నిర్వహించిన బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హాజరయ్యారు. ఈ సభలో బండి సంజయ్ చేసిన కామెంట్లు తెలంగాణలో సంచలనమయ్యాయి. కేసీఆర్ కుటుంబం అవినీతి చిట్టా తీశామని.. త్వరలోనే ఆయన జైకులు వెళ్లడం ఖాయమన్నారు. కేసీఆర్ కోసం కరీంనగర్ జైలులో గదిని సిద్ధం చేస్తున్నామని కూడా బండి సంజయ్ కామెంట్ చేశారు. దీంతో కేసీఆర్ కు ఉచ్చు బిగిసుకుంటుందా.. ఆయన జైలుకు వెళ్లడం ఖాయమా అన్న చర్చ సాగుతోంది.

బండి సంజయ్ కామెంట్లతో రంగంలోకి దిగింది కాంగ్రెస్. బీజేపీ నేతలకు షాకిచ్చింది. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం సోమవారం ఉదయం కరీంనగర్ జైలుకు వెళ్లింది. అయితే జైలు గేటు బయటే సిబ్బంది కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. దీంతో కేసీఆర్ కోసం కట్టిన గది చూపించాలని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నేతలతో కలిసి పొన్నం ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం జైల్లో ప్రత్యేక గదిని తయారు చేశామని బండి సంజయ్ ప్రకటించారని.. ఆ గదిని చూసేందుకు వెచ్చామని చెప్పారు. బండి సంజయ్ చెప్పిన గది ఎక్కడుందో, ఎలా ఉందో చూసి వస్తామంటూ జైలు సిబ్బందితో వాదించారు. జైలులో కేసీఆర్ కోసం సిద్ధం చేసిన గదిని తమకు చూపించాలని అధికారులను కోరారు.

జైలు దగ్గరికి వాహనంలో వచ్చిన సబ్ జైలు అధికారిని ఆపి గది ఎక్కడుందో చూపించాలని కోరారు  పొన్నం ప్రభాకర్. మాట్లాడుతానంటూ లోపలికి వెళ్ళిన జైలర్.. పొన్నం దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు డిప్యూటీ జైలర్ శ్రీనివాస్ రెడ్డిని పంపించారు. ఎలాంటి కొత్త గదులు కట్టలేదని పాతవే ఉన్నాయని వివరణ ఇచ్చారు డిప్యూటీ జైలర్. బండి సంజయ్ చెప్పినట్టుగా కొత్తగా ఏమైనా కట్టి అందులో సౌకర్యాలు ఏర్పాటు చేశారా అని  పొన్నం అడగగా.. అలాంటిదేమీ లేదని చెప్పారు కరీంనగర్ సబ్ జైలు డిప్యూటీ  జైలర్. తర్వాత మీడియాతో మాట్లాడిన బండి బండి సంజయ్ అబద్దాలకోరు అని మండిపడ్డారు. రెండేళ్లుగా కేసీఆర్ ను జైల్లో పెడతామంటూ ప్రగల్బాలు పలకడం తప్ప బండి సంజయ్ చేసింది ఏమీ లేదని ఫైరయ్యారు.

Read also: Sai Priya Case: విశాఖ సాయిప్రియ కేసులో మరో ట్విస్ట్‌.. ఈసారి ఏం జరిగిందంటే?

Read also: TDP BJP ALLAINCE: త్వరలో బీజేపీ కూటమిలోకి టీడీపీ? మోడీ, షాతో చంద్రబాబు చర్చలు సఫలం! జాతీయ మీడియాలో కథనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News