Revanth Reddy Good News: చారిత్రక ఇంద్రవెల్లి ప్రాంగణం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు శుభవార్త వినిపించారు. నాగోబా ఆలయంలో దర్శనం అనంతరం కేస్లాపూర్‌లో ఏర్పాటుచేసిన స్వయం సహాయక సంఘాల మహిళల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. గ్యాస్ సిలిండర్, విద్యుత్ అధిక ధరల్లో ఉన్నాయని.. దీనివలన మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం నిలబెట్టేలా కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలో తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని వివరించారు.
గ్యాస్ సిలిండర్ రూ.1,200 ఉందని, త్వరలో మహిళలకు రూ.500లకే ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ప్రియాంక గాంధీని పిలిచి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని, త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు కడుపునొప్పి ఎందుకని నిలదీశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పక నెరవేరుస్తుందని స్పష్టం చేశారు.
స్వయం సహాయక మహిళలకు వరాలు
కేస్లాపూర్‌లో నిర్వహించిన సమావేశంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. గతంలో తక్కువ వడ్డీకే మహిళలకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే కల్పిస్తామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1,450 డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.60 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేసినట్లు వివరించారు. స్వయం సహాయక సంఘాలకు పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. అంతకుముందు కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: King Cobra Vs Stray Dogs: కుక్కలే గుంపులుగా వస్తే సింగిల్‌గా దిగిన పాము గెలిచిందా? ఓడిందా?
Also Read: King Cobra on Fan: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో ఫ్యాన్‌పై తిరుగుతూ కింగ్ కోబ్రా హల్‌చల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook