Allu Arjun: రేవంత్ సర్కారును కూల్చేందుకు అల్లు అర్జున్ ప్లాన్..?.. పుష్ప2 సినిమాలో మాదిరిగా పావులు.. బాంబు పేల్చిన హైకోర్టు లాయర్..

Allu Arjun Vs Revanth Reddy: పుష్ప2 తొక్కిసలాట ఘటనలో ఈరోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హజరైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 24, 2024, 05:31 PM IST
  • అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన లాయర్..
  • జైలుకు వెళ్లడం ఖాయమంటూ జోస్యం..
Allu Arjun: రేవంత్ సర్కారును కూల్చేందుకు అల్లు అర్జున్ ప్లాన్..?.. పుష్ప2 సినిమాలో మాదిరిగా పావులు.. బాంబు పేల్చిన హైకోర్టు లాయర్..

paduri Srinivasa reddy sensational comments on allu arjun: పుష్ప2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను ఏ 11 గా పోలీసులు చేర్చారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ ను ఏకీపారేశారు. అయితే... మరల బన్నీ అదే రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కారుకు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చి తమ ఎదుట హజరు కావాలని ఆదేశించారు. బన్నీ.. ఈ రోజు చిక్కడ పల్లి పోలీసుల ఎదుట హజరయ్యారు. అదే విధంగా పోలీసులు బన్నీపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తొంది.  మూడు గంటల విచారణ తర్వాత అల్లు అర్జున్ మరల తన ఇంటికి వెళ్లిపోయారు.

 

ఈ నేపథ్యంలో విచారణ ముగిసిన తరువాత.. అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. అల్లు అర్జున్ ను కొంత మంది రాజకీయాపావుగా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. పుష్ప సినిమాలో చేసినట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్‌ను కుప్ప కూల్చాలని చూస్తున్నారని బాంబు పేల్చారు.

ఆయన వెనుక ఒక శక్తి ఉందని అన్నారు. రేపటి నుంచి వారంలో రేవంత్ సర్కారు కూల్చేందుకు ప్లాన్ లు చేశారని సంచలన ఆరోపనలు చేశారు. ఈ వారంలో బీఆర్ఎస్ లు, బీజేపీలు కూడా.. తమదైన స్టైల్ లో రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Read more: Vijay - Rashmika: టెన్షన్‌లో పుష్పరాజ్.. ప్రియుడితో కలిసి వెకెషన్ ట్రిప్‌కు వెళ్లిన రష్మిక మందన్న.. పిక్స్ వైరల్..

అల్లు అరవింద్‌ ఫ్యామిలీని కాపాడటానికి అపోసిషన్ నేతలు మాట్లాడుతున్నారని, పక్క స్టేట్స్ నుంచి కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన బెయిల్ దొరికాక ప్రవర్తించిన విధానంను బట్టి ఆయన బెయిల్ రద్దు కావడం ఖాయమని.. రెండు మూడు రోజుల్లో ఆయన అరెస్ట్ కావడం ఖాయమన్నారు.  ఇదిలా ఉండగా..  అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాంగా మాత్రమే కాకుండా.. సినిమా ఇండస్ట్రీలో కూడా కాకరేపుతున్నాయని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News