హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమీక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. బుధవారం రాత్రి వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆమె.. గురువారం అనూహ్యంగా బీజేపీలో చేరడం అందకీ ఆశ్యర్యానికి గురిచేసింది.. అనూహ్య, నాటకీయ పరిణామం కాంగ్రెస్ వర్గాలకు షాక్ గురిచేసింది.
సాయంత్రానికి సీన్ రివర్స్...
మధ్యాహ్నం బీజేపీలో చేరిన పద్మినీ రెడ్డి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్నారు. అక్కడ వందలాదిగా వేచి ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. నిర్ణయం మార్చుకోవాలంటూ ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఇదే సందర్భంలో దామోదర్ రాజనర్సింహ కూడా ఆమెకు నచ్చజెప్పారు. దీంతో తన నిర్ణయమార్చుకొని మరో ప్రకటన చేశారు. కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకుని.. తిరిగి కాంగ్రెస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు.
కారణం ఏమై ఉంటది...?
అనూహ్య రీతిలో బీజేపీలో చేరి కాంగ్రెస్ వర్గాలకు షాక్ గురిచేసిన పద్మినీ రెడ్డి.. సాయంత్రానికల్లా మళ్లీ ఆమె కాంగ్రెస్ గూటికి చేరి బీజేపీ వర్గాలను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేశారు. పద్మినీ రెడ్డి అసలు ఎందుకు బీజేపీలో చేరినట్లు...? సాయంత్రాని కల్లా నిర్ణయం మార్చుకొని ఎందుకు మళ్లీ సొంతగూటికి చేరారనే విషయం ఇప్పడు ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.