సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా దారుణమైన అత్యాచార ఘటన జరిగింది. ఓ ఆర్మీ జవాన్ కూతురి(తొమ్మిదో తరగతి)పై దుండగులు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

Last Updated : Feb 18, 2018, 06:42 PM IST
సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన

సికింద్రాబాద్‌లో నిర్భయ ఘటన తరహాలో దారుణమైన అత్యాచార ఘటన జరిగింది. ఓ ఆర్మీ జవాన్ కూతురిపై దుండగులు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుని వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా తొమ్మిదో తరగతి చదువుతున్న15 ఏళ్ల బాలికను దుండగులు అడ్డగించారు. అనంతరం చెట్ల పొదల్లోకి లాక్కొని వెళ్లారు. రాడ్డుతో కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

స్పృహ కోల్పోయి ఉన్న బాలికను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జరిగి  రెండు నెలలు అయింది. అయినా ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చేయలేదని సమాచారం. దీనిపై పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Trending News