రేవంత్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు ఏం జరిగింది ?

అనేక నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

Last Updated : Oct 21, 2019, 09:44 PM IST
రేవంత్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు ఏం జరిగింది ?

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. సోమవారం ఉదయం నుంచే ఆ పనిలో నిమగ్నమైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు, కీలక నేతలు ఎందరో ప్రగతి భవన్ ముట్టడికి యత్నించి అరెస్ట్ అయ్యారు. ప్రగతి భవన్ ముట్టడికి తీవ్రంగా యత్నించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ప్రగతి భవన్‌ని ముట్టడించేందుకు రేవంత్ రెడ్డి ఎలాగైనా వస్తారని ముందే ఊహించిన పోలీసులు.. ఆయన ఎక్కడున్నారు ? ఎటువైపు నుంచి ఏ వాహనంలో వస్తారు అని తెలుసుకునే పనిలో పడ్డారు. రేవంత్ రెడ్డి నివాసం, ఆయన అనుచరులు, సమీప మిత్రుల నివాసాల వద్ద సైతం పోలీసులు పహారా కాశారు. ఆయన రోడ్డెక్కితే అదుపులోకి తీసుకునేందుకు ఎక్కడికక్కడ బలగాలను మోహరించారు. అయితే, వారికి రేవంత్ రెడ్డి ఆచూకీ దొరకలేదు. కానీ ఉన్నట్టుండి నాటకీయ పరిణామామ మధ్య మధ్యాహ్నం వేళ ద్విచక్రవాహనంపై ప్రగతి భవన్‌కి వచ్చిన రేవంత్ రెడ్డిని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. వారిని తోసుకుంటూ వెళ్లి గేటుని తాకివచ్చిన రేవంత్ రెడ్డి.. ఇవాళ ఇంత భారీ బందోబస్తును సైతం దాటుకుని గేటును తాకామని... ఇక ప్రగతి భవన్‌ని బద్దలుకొట్టడమే తర్వాత మిగిలిఉందని అధికార పార్టీకి సవాల్ విసిరారు.

Trending News