Indiramma Illu: తెలంగాణలో జాగా ఉన్న ప్రతి ఒక్క అర్హులకు ప్రభుత్వం సొంత డబ్బులతో ఇళ్లు కట్టిస్తుందని ఎన్నికల హామిలో భాగంగా చెప్పింది. అంతేకాదు ఈ పథకం ఇది అర్హులందరికీ అమలు చేయడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా GHMC , ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పబ్లిక్ పెట్టుకున్న అప్లికేషన్లలో 25 శాతం మందికి కూడా సొంత స్థలాలు లేవని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు.
సర్వే పూర్తయ్యాక ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళనున్నారు. కాగా, నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.5 లక్షల మంది సొంతంగా ప్లేస్ ఉన్న పేదలకు తొలి దశలో ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లను కట్టిస్తోంది. ఇదంత కేంద్రం నేతృత్వంలోని పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టి ఇస్తుంది. ఇందులో మేజర్ షేర్ కేంద్రానిది. రాష్ట్ర ప్రభుత్వాలకు 25 శాతం నుంచి 30 శాతం వాటా ఉంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్.. జాగా ఉన్న నిరుపేదలకు ఏ మేరకు ఇళ్లు కట్టి ఇస్తుందనేది చూడాలి.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.