Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తెరకెక్కించే సినిమాల్లో కంపల్సరీ ఆ విషయాలు ఉండేలా చూసుకోవాలని కండిషన్ పెట్టారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 2, 2024, 03:38 PM IST
Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..

Revanth Reddy: టాలీవుడ్ సినీ పరిశ్రమపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు ఇకపై సినీ పరిశ్రమ నిర్మించే చిత్రాల్లో డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించాలని కోరారు. అది చిన్న చిత్రమైనా.. వందల కోట్ల బడ్జెట్ తెరకెక్కించిన సినిమా అయినా.. సినిమాలు ప్రదర్శించే థియేటర్స్ హాల్లో మూడు నిమిషాల పాటు సైబర్ క్రైమ్ నేరాలతో పాటు, డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేలా ఓ యాడ్ ప్రదర్శించాలని కోరారు. బడా బడ్జెట్ సినిమాలకు సినిమా టికెట్ రేట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు. కానీ ప్రజలపై ముఖ్యంగా యువత తీవ్ర దుష్ప్రభావం చూపించే డ్రగ్స్, సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.  
 
ముఖ్యంగా డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తర్వాత కానీ 3 నిమిషాలు వీడియోతో అవగాహన కార్యక్రమంలో కల్పించేలా దర్శక, నిర్మాతలతో పాటు హీరోలు చొరవ తీసుకోవాలన్నారు. అలా కల్పించకపోతే.. వారి సినిమాలకు టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టారు.
ఈ యాడ్ ప్రదర్శించని నిర్మాతలకు గానీ, డైరెక్టర్ లకు కానీ.. నటీనటులకు ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయ సహకారాలు అందవని అల్టీమేటం జారీ చేసారు.

సినిమా హాల్స్ లో ఈ యాడ్స్ ప్రదర్శించడానికీ థియేటర్స్ యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. అంతేకాదు డ్రగ్స్, సైబర్ నేరాల రహితంగా రాష్ట్రాన్ని, దేశాన్ని విముక్తి కల్పించడంలో భాగంగా ఇకపై థియేటర్స్, మల్టీప్లెక్స్ నిర్వాహకులు విధిగా ఈ యాడ్స్ ప్రదర్శించాల్సిందే అని చెప్పారు. అలా చేయని థియేటర్స్ ను సీజ్  చిత్ర ప్రదర్శనలకు అంగీకరించ బోమని తేల్చి చెప్పారు.

Read more:Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News