Bumper Offer To Gulf Workers: తెలంగాణ నుంచి జీవనోపాధి కోసం చాలామంది గల్ప్ దేశాలకు వెళుతుంటారు. అటువంటి వారి కోసం రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి కుటుంబాలకు రూ.5 లక్షలు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో పండుగ ముందు తీపి కబురు అందించింది ప్రభుత్వం.ముఖ్యంగా తెలంగాణ నుంచి పనికోసం గల్ఫ్ దేశాలు అయిన ఒమన్, ఖతర్, సౌదీఅరేబియా, బహ్రెయిన్, కువైట్ వెళ్తుంటారు.వారు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. అలా గల్ఫ్ దేశాలకు వెళ్లి మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి కూడా మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు.
ఈ నిర్ణయంతో గల్ఫ్ వెళ్లి మరణించిన బాధిత కుటుంబాలకు కేవలం ఆరు నెలల్లోనే ఈ సాయం అందించాలని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించారు. బాధిత కుటుంబాలు తమ వారిని కోల్పియిన ఆరు నెలల్లోనే ఈ దరఖాస్తు చేసుకోవాలి. కుటుంబంలో భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైనా అప్లై చేయవచ్చు.
ఇదీ చదవండి: మహిళల తలరాతలను మార్చే అద్భుత పథకం.. రూ.10 లక్షలు పొందే ఛాన్స్, ఇలా వెంటనే అప్లై చేసుకోండి..
అర్హులైనవారికి రూ.5 లక్షల సాయం అందించనున్నారు. దీనికి బాధిత కుటుంబాలు మరణించిన వారికి వివరాలతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరణించిన వారి డెత్ సర్టిఫికేట్‌తోపాటు పాస్‌పోర్ట్ కూడా అందించాలి. దీని ద్వారా వారి కుటుంబాలకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమా చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
అయితే, ఈ పథకానికి అర్హులు ఎవరు కూడా చెప్పింది ప్రభుత్వం. 2023 డిసెంబర్ 7 తర్వాత గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు అర్హులు. ఆరు నెలల్లోగా ఈ ఎక్స్‌గ్రేషియాకు దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ రేవంత్ సర్కార్ ఈ కీలక నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా గల్ఫ్ దేశాలకు వెళ్లి తమ ప్రాణాలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది.
ఇదీ చదవండి: చిటికెలో పీఎఫ్ బ్యాలన్స్..! 2 నిమిషాల్లో మీ డబ్బులను మొబైల్ ద్వారా విత్‌డ్రా చేసుకోండి..
ఉపాధి నిమిత్తం మన తెలంగాణ నుంచి అనేక మంది గల్ఫ్ దేశాలకు ప్రతి ఏడాది వెళుతుంటారు. అక్కడ కొంతమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు ఉంటారు. అందులో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినవారు కూడా ఉన్నారు. సొంత ఊరిలో అప్పు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లినవారు కోకొల్లలు. అలాంటి బాధిత కుటుంబాలు తమ ఇంటి పెద్దను కోల్పోవడంతోపాటు ఆ అప్పులు కూడా తీర్చాల్సిన దుస్థితి ఏర్పాడుతోంది. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ ఈ ఎక్స్‌గ్రేషియా వల్ల ఆ కుటుంబాలకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter