Hyd Zoo: మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఆశా, కల్నల్ సంతోష్ బాబు పేరు

రాయల్ బెంగాల్ ( Royal bengal ) సంతతికి చెందిన ఆ పులికి అరుదైన గౌరవం దక్కింది. దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. హైదరాబాద్ జూలో పుట్టిన ఆ పులిపిల్లకు అలా అరుదైన గౌరవం దక్కింది.

Updated: Aug 15, 2020, 07:51 PM IST
Hyd Zoo: మూడు పిల్లలకు జన్మనిచ్చిన ఆశా, కల్నల్ సంతోష్ బాబు పేరు

రాయల్ బెంగాల్ ( Royal bengal ) సంతతికి చెందిన ఆ పులి ( Tiger ) కి అరుదైన గౌరవం దక్కింది. దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు. హైదరాబాద్ జూలో పుట్టిన ఆ పులిపిల్లకు అలా అరుదైన గౌరవం దక్కింది.

హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ( Nehru zoological park ) లో రాయల్ బెంగాల్ టైగర్ ఆశా ( Asha ) మూడు పిల్లలకు జన్మనిచ్చింది. రాయల్ బెంగాల్ టైగర్ జాతి అంతరించిపోతుందనుకునే సమయంలో మూడు పులిపిల్లలు జన్మించడం మంచి పరిణామంగా జూ అధికారులు భావిస్తున్నారు. లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో ఆశా జన్మనిచ్చిన పిల్లల్లో ఒక పులికి కల్నల్ సంతోష్ బాబు ( Col santhosh ) పేరిట సంతోష్ గా నామకరణం చేశారు. మిగిలిన రెండు పిల్లలకు సూర్య ( Surya ), సంకల్ప్ ( Sankalp )గా పేరు పెట్టారు. మొత్తం మూడు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్టు జూ అధికారులు చెప్పారు.