Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

Fire Accident: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం వివరాలు ఇలా..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 23, 2022, 09:06 AM IST
  • సికింద్రాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం
  • బోయిన్ గూడలోని టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది సజీవ దహనం
  • తెల్లవారుజామున 2-3 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం
 Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

Fire Accident: సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం వివరాలు ఇలా..

సికింద్రాబాద్ బోయిన్‌గూడలోని ఓ టింబర్ డిపోలో ఇవాళ తెల్లవారుజామున బారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. డిపో అంతా తగలబడింది. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 15 మంది కార్మికులు అక్కడే నిద్రిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనయ్యారు. నలుగురికి గాయాలు కాగా..ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బీహార్ వాసులుగా గుర్తించారు. డిపో అంతా కలప కావడంతో మంటల తీవ్రత అధికమైంది. 

Timber Depot in Secunderabad Fired

ఉదయం 2-3 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దాదాపు 8 ఫైరింజన్ల సహాయంతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. మంటల ధాటికి గోడౌన్ పైకప్పు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. భారీగా మంటలు, పొగ అలముకోవడంతో సహాయకచర్యలు కష్టంగా మారాయని అధికారులు తెలిపారు.

Secunderabad Fire Accident

ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు..మృతుల్లో బిట్టు, సికిందర్, దామోదర్, సత్యేందర్, చింటు, దినేష్, రాజు, దీపక్, పంకజ్ ఉన్నట్టు తెలిసింది. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

Also read: Fuel Prices In Hyderabad: వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్.. భగ్గుమంటున్న పెట్రో ధరలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News