Singareni Privatization: సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఖచ్చితంగా అడ్డుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. ఈ విధంగా స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు రూపొందించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేసారు. కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు 29% లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆమె తెలిపారు.
తమ ప్రభుత్వానికి కార్మికుల శ్రేయస్సు ప్రాధాన్యమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆమె అన్నారు. కార్మిక పక్షాన బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి సంస్థను కాపాడుకుంటామని కవిత స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో టీబీజీకేఎస్ కీలక పాత్ర పోషించిందని.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం సైతం కార్మికులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బొగ్గు గనుల్లో ప్రమాదవశాత్తు మరణించిన సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఆమె నివాళులు అర్పించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్ రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రతినిధులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే.. మీ ఉద్యోగాలు మీ ఇంటికే... : నిరుద్యోగ యువతకు రేవంత్ పిలుపు
ALso Read: Telangana Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఉచితంగా జాబ్ కోచింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook