Telangana Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఉచితంగా జాబ్ కోచింగ్!

Telangana Jobs: తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 91,142 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల కోసం ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 11, 2022, 09:25 AM IST
Telangana Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. ఉచితంగా జాబ్ కోచింగ్!

Telangana Jobs: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలే నిరుద్యోగులకు తీపికబురు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,142 ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. పోటీ పరీక్షలకు పోటీ పడుతున్న అభ్యర్థులు వేలకు వేలు కోచింగ్ లకు ఖర్చు చేస్తున్నారు. అయితే కొంతమంది పేద విద్యార్థులు కోచింగ్ డబ్బు లేక ఇంట్లోనే పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితులను తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. అలాంటి వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

పేద విద్యార్థుల కోచింగ్ కోసం టీ - శాట్ ఛానల్స్ ను ఉపయోగించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీశాట్ నిపుణ, టీశాట్ విద్య అనే టీవీ ఛానల్స్ ను తెలంగాణ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. వీటిలో పోటీ పరీక్షలకు పాఠాలు చెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంట్లో కూర్చొనే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వొచ్చు. 

దీంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో అధికార ఎమ్మెల్యేలు.. పోటీ పరీక్షలు ఉద్యోగుల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అందుకు ఎమ్మెల్యేకు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

కొలువుల జాతర

ఇటీవలే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాల నోటిఫికేషన్ లో మొత్తం 91,142 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు 80,039 పోస్టులకు నోటిఫికేషన్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. జిల్లా స్థాయిలో 39,829, జోనల్ స్థాయిలో 18,866, ఆ తర్వాత స్థాయిలో 13,170 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన వచ్చింది.  

Also Read: కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే.. మీ ఉద్యోగాలు మీ ఇంటికే... : నిరుద్యోగ యువతకు రేవంత్ పిలుపు

Also Read: Danam Nagender Dance: గులాబీ దళాల సంబురం.. ఎమ్మెల్యే దానం 'తీన్మార్' డ్యాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News