Telangana Assembly Elections 2024: తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను ఛీ కొట్టారు. దాదాపు రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని తన కనుసైగలతో శాసించిన కేసీఆర్ ను గత ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకే పరిమితం చేసారు ఇక్కడి ఓటర్లు. అంతేకాదు ఐదు నెలలు తిరక్కముందే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టారు ఇక్కడి ఓటర్లు. ప్రజలు తలుచుకుంటే నెత్తిమీద పెట్టుకుంటారు. అతి చేస్తే కింద తోసి పడేస్తారనేదానికి తెలంగాణలో కేసీఆర్.. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదాహణలుగా నిలిచారు. అభివృద్దిని పక్కన పెట్టి .. కేవలం సంక్షేమాన్ని నమ్ముకున్న జగన్ ను ఇంటికి పంపించారు. మరోవైపు కేసీఆర్ మాత్రం తెలంగాణను అభివృద్ది చేసారు. మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఇక్కడ ప్రజలు కేసీఆర్ అహంకారాన్ని తట్టుకోలేకపోయారు.
ఆయన్ని కలవాలంటే ఎన్నో సమస్యలు.. క్యాబినేట్ మంత్రులు అప్పట్లో కేసీఆర్ ను కలవాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు పడేవారు. మొత్తంగా ఓ నియంతలా తెలంగాణను పాలించిన కేసీఆర్ కు గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. కనీసం పార్టీ సభ్యులు అభిప్రాయాలను తీసుకునేవారు కాదనే అభిప్రాయం అందిరిలో ఉంది. పైగా పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చడం కూడా వ్యతిరేకతకు కారణమైంది.
అదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరకు 39 సీట్లకు గాను 7 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం లోక్ సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కట్టబెట్టలేదు. కనీసం 17 పార్లమెంట్ సీట్లలో ఎక్కడ రెండో స్థానంలో లేకపోవడం గమనార్హం. తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్ ను గుండెల్లో పెట్టుకున్న ఇక్కడ ప్రజలు.. కేవలం పదేళ్లలోనే ఆయనపై వ్యతిరేకతతో కేవలం పార్లమెంట ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వకుండా ఛీ కొట్టారు. మొత్తంగా కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు ఓ గుణపాఠం నేర్పారనే చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook