Telangana Bhavan: బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్(BRS) ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారాలు చేస్తున్నారంటూ.. రెవెన్యూ శాఖ తెలంగాణ భవన్‌కు నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి ఛానల్‌ను ఎప్పటినుంచి షిఫ్టింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారో.. అనే అంశంపై ఏడు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని తెలంగాణ భవన్ ఇన్చార్జ్ శ్రీనివాసరెడ్డిని రెవెన్యూ శాఖ ఆదేశించింది. గత 13 సంవత్సరాల నుంచి టీ న్యూస్ ఛానల్‌ను అదే భవన్‌లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది. ఈ టీ న్యూస్‌ను 2011 సంవత్సరంలో స్థాపించగా అప్పటినుంచి తెలంగాణ భవన్‌లోని కొనసాగుతూ వస్తోంది.
నిబంధనలను ఉల్లంఘించి పార్టీ ఆఫీసులో ఛానల్‌ను ఎలా నడుపుతున్నారో చెప్పాలని రెవెన్యూ శాఖ నోటీసుల్లో తెలిపింది. ఇదిలా ఉండగా టీ న్యూస్ యాజమాన్యం తెలంగాణ భవన్ నుంచి వేరే చోటికి ఆఫీసును మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నోటీసును దృష్టిలో పెట్టుకొని యజమానులు శరవేగంగా ఆఫీస్‌ను చేంజ్ చేయబోతున్నట్లు అధికారిక సమాచారం. ఈ రెవెన్యూ శాఖ జారీ చేసిన నోటీసుల విషయంపై తెలంగాణ భవన్ సిబ్బంది నుంచి వివరణ రావాల్సి ఉంది.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter