Bandi Sanjay: మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్

BJP Atma Gourava Deeksha in Moosapet: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. రాష్ట్రంలో కేంద్రం రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తే.. 7 వేలు ఇండ్లు మాత్రమే కట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 11, 2023, 03:36 PM IST
Bandi Sanjay: మాటలు కోటలు దాటుతాయ్.. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు: బండి సంజయ్

BJP Atma Gourava Deeksha in Moosapet: సీఎం కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంత మంది దరఖాస్తు చేశారు..? ఎంత మందికి ఇళ్లు కేటాయించారో వివరాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందన్నారు. అధికారులను నిలదీస్తే 7 వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు. పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. తెలంగాణ ప్రభుత్వం కోరితే పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈరోజు కూకట్ పల్లి మూసాపేటలో బీజేపీ నేతలు చేస్తున్న ‘‘ఆత్మగౌరవ దీక్ష’’లో బండి సంజయ్‌  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆత్మగౌరవ దీక్ష చేస్తున్న బీజేపీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. 

'తెలంగాణ ప్రజలు నిలువ నీడ లేక జనం చచ్చిపోతున్నారు. ఎక్కడ ఖాళీ స్థలముంటే అక్కడ గుడిసె వేసుకుని ఎండకు ఎండుతూ వానకు తడస్తూ అల్లాడుతున్నారు. కూకట్‌పల్లికి వచ్చి ఎంతోమంది ఇక్కడే ఏండ్ల తరబడి అద్దె ఇండ్లలో ఉంటూ కిరాయిలు కట్టలేకపోతున్నారు. ఇట్లాంటి పేదల బాధలను తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్లను నిర్మించింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు కావాలని అడిగితే లక్షన్నర ఇండ్లు కావాలని కేసీఆర్ చెబితే.. మరో లక్ష ఇండ్లు అదనంగా మంజూరు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం ఆ ఇండ్లు పేదలు ఉండలేరు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని ఊరించి మోసం చేసిండు. కేసీఆర్ కొడుకు మాటలన్నీ కొంపలు ముంచేవే. అమెరికా పోయి చదివిన చదువు మోసం చేయడానికే తప్ప.. సంగారెడ్డిలో ఇయాళ ఆ కుటుంబం సంగతి చెబుతా..

కేంద్రం మంజూరు చేసిన ఇండ్లలో తెలంగాణ ప్రజలకు ఎన్ని ఇండ్లు కట్టించారని నిలదీస్తే.. 7 వేల ఇండ్లు మాత్రమే పూర్తి చేశారని అధికారులు తేల్చారు. రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తే 7 వేలు ఇండ్లు మాత్రమే కట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నడు కేసీఆర్. మాటలు కోటలు దాటుతయ్.. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పెద్ద పెద్ద గ్రాఫిక్స్ తో వీడియో తీసి కేంద్రానికి చూపించిన కేసీఆర్ ప్రభుత్వం పేదలకు మాత్రం ఒక్క ఇల్లు కూడా ఇయ్యలే. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారు..? ఎంతమందికి ఇండ్లు కేటాయించారు..? ఎంతమంది ఆ ఇండ్లలో నివాసముంటున్నారో దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలి. అక్కడక్కడా కడుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం నాసిరకంగా ఉన్నయ్. ఇండ్లలోకి వెళ్లకముందే కూలిపోయే దశలో ఉన్నయ్..' అని బండి సంజయ్ అన్నారు.

తెలంగాణ ప్రజలు ఏం పాపం చేశారని వాపోయారు. 1400 మంది యువకుల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ ఎవడి పాలైందన్నారు. వేల కోట్లు దోచుకున్న కేసీఆర్‌కు పేదలకు రెండు గదుల ఇండ్లు ఇవ్వడానికి చేతులు రావడం లేదని అన్నారు. అందుకే పేదల పక్షాన బీజేపీ ఉద్యమిస్తోందని చెప్పారు. ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని.. అయినా సరే బెదిరేది లేదని స్పష్టం చేశారు. పేదలకు ఇండ్లు ఇచ్చే వరకు పోరాడతామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలువనీడ లేని పేదలందరికీ ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఇన్నాళ్లు బాధపడ్డార.. మరొక్క 5 నెలలు ఓపిక పట్టాలన్నారు. బీజేపీ అధికారంలోకి రాంగనే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని.. ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: MS Dhoni Six Video: ధోని సిక్సర్లు.. కూతురు జీవా సంబురాలు.. వీడియోలు చూశారా..!  

Also Read: Lalit Yadav Catch Video: ఢిల్లీ బౌలర్ సూపర్ క్యాచ్.. షాక్‌లో అంపైర్.. వీడియో వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News