close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం!

తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం!

Updated: Feb 23, 2019, 02:35 PM IST
తెలంగాణ కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు అవకాశం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై నేడు అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ కేటాయించిన ఎమ్మెల్సీ సీట్లలోనూ ఒక మహిళకు అవకాశం ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మొత్తం 17 మందితో మంత్రివర్గం ఏర్పాటు కానుండగా రానున్న రోజుల్లో మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకోనున్నామని... అందులో ఇద్దరు మహిళలు ఉండనున్నారని కేసీఆర్ సభకు తెలిపారు. 

తమ ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం వందని, వారిని నిర్లక్ష్యం చేయకూడదనే ఉద్దేశంతో మహిళా సంఘాలకు అందించే వడ్డీలేని రుణాలను రూ. 10 లక్షలకు పెంచుతున్నామని కేసీఆర్ ప్రకటించారు. ఆయా రుణాలపై వడ్డీ కూడా ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తమకు మహిళలే ఎక్కువగా ఓట్లు వేశారని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు.