తెలంగాణలో ద్వితీయ అధికారభాషగా ఉర్దూ..!

  

Last Updated : Nov 10, 2017, 07:28 PM IST
తెలంగాణలో ద్వితీయ అధికారభాషగా ఉర్దూ..!

తెలంగాణలో ఉర్దూ ఇప్పుడు రెండవ అధికారిక భాషగా ప్రకటించబడింది. దీనికి సంబంధించిన ప్రకటనను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఈ విషయమై ప్రకటన జారీ చేశాక, కేసీఆర్ పలువురు నేతల నుండి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

ముఖ్యంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ, సీఎం ఓటు బ్యాంకు పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని.. ముస్లిములకు ప్రత్యేక ఐటి కారిడర్ ప్రకటించిన ఆయన ఇప్పుడు ఉర్దూని అధికార భాషగా  ప్రకటించి  హిందీ, ఆంగ్లాలను ప్రక్కన పెట్టారని తెలిపారు.

ఉర్దూ కంటే హిందీ, ఇంగ్లీష్ మాట్లాడితేనే తెలంగాణలో యువత ఉద్యోగాలు పొందే పరిస్థితి ఉందని తెలియజేశారు. అయితే తన ప్రకటనలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఇక నుండి ప్రభుత్వం ఆర్జీలను, పిటీషన్లను ఉర్దూలో కూడా తీసుకుంటుందని, పోటీ పరీక్షలు కూడా ముస్లిముల కోసం ప్రత్యేకంగా ఉర్దూలో నిర్వహించడానికి ప్రయత్నిస్తామని తెలియజేశారు. అలాగే రిజర్వేషన్లో ముస్లిములకు 12 శాతం ఉండాల్సిన అవసరం గురించి కూడా కేసీఆర్ మాట్లాడారు. 

‘ఉర్దూను ద్వితీయ భాషగా ప్రకటించాలని చాలా కాలంగా ఒక డిమాండ్ ఉంది. అందుకే జిల్లాలను యూనిట్‌గా తీసుకోకుండా మొత్తం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఉర్దూను ద్వితీయ అధికార భాషగా అమలు చేస్తాం’ అని శాసనసభలో ప్రకటించారు. సీఎం తీసుకున్న నిర్ణయంపై ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఔవైసీ హర్షం వ్యక్తం చేశారు. 

 

Trending News