CM KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం కేసీఆర్... వెంట సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత...

CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్ 3) సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 07:27 PM IST
  • ఢిల్లీకి సీఎం కేసీఆర్
  • వ్యక్తిగత పర్యటనా..? రాజకీయ పర్యటనా...?
  • ప్రధాని అపాయింట్‌మెంట్ కోరిన సీఎంవో వర్గాలు
CM KCR Delhi Tour: ఢిల్లీకి సీఎం కేసీఆర్... వెంట సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత...

CM KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్ 3) సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. వారం రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. వరి ధాన్యం కొనుగోలు అంశంపై మరోసారి కేంద్రంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీఎంవో వర్గాలు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం.

తెలంగాణలో పండించిన ప్రతీ గింజను కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ సర్కార్ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ మంత్రుల బృందం కేంద్రంతో చర్చలు జరిపింది. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో యాక్షన్‌లోకి దిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 4 నుంచి 11 వరకు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ వరకు నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది.

ఈ నెల 11న సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. తాజాగా ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్... చివరి ప్రయత్నంగా మరోసారి కేంద్రంతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ చర్చలు కూడా విఫలమైతే.. ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. దీక్షకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులకు ఢిల్లీ నుంచే ఆయన మార్గ నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు, కేసీఆర్ ఢిల్లీ టూర్ వ్యక్తిగత పర్యటనే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ సతీమణి శోభ వైద్య పరీక్షల నిమిత్తమే ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికైతే టీఆర్ఎస్ వర్గాల నుంచి ఎటువంటి క్లారిటీ లేదు.

Also Read: DrugsQueenNiharika: నిహారికపై ట్విట్టర్‌లో ట్రోలింగ్... ట్రెండింగ్‌లో 'డ్రగ్స్ క్వీన్ నిహారిక' హాష్‌ట్యాగ్ 

Niharika Konidela: నిహారిక తప్పు లేదు.. అనవసర ఊహాగానాలు వద్దు... నాగబాబు రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News