తెలంగాణ CM KCR కు కరోనా పాజిటివ్.. నిపుణుల సమక్షంలో చికిత్స

Telangana CM KCR health condition: హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి స్వల్ప లక్షణాలు (Mild symptoms of COVID-19) మాత్రమే ఉన్నందున ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2021, 08:07 PM IST
  • తెలంగాణ CM KCR కు కరోనా పాజిటివ్.. నిపుణుల సమక్షంలో చికిత్స.
  • CM KCR health condition పై మీడియాకు ప్రకటన విడుదల చేసిన సీఎస్ సోమేష్ కుమార్
  • ఇటీవలే Nagarjuna sagar లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణ CM KCR కు కరోనా పాజిటివ్.. నిపుణుల సమక్షంలో చికిత్స

Telangana CM KCR health condition: హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి స్వల్ప లక్షణాలు (Mild symptoms of COVID-19) మాత్రమే ఉన్నందున ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌజ్‌లోనే వైద్య నిపుణుల సమక్షంలో వైద్య సహాయం పొందుతూ ఐసోలేట్ అయ్యారని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ తాజాగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

Telangana CM KCR health condition latest updates

Also read : మాజీ ప్రధాని Manmohan Singh కి కరోనా పాజిటివ్.. AIIMS లో చికిత్స

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక (Nagarjuna sagar by-poll) కోసం చేపట్టిన ప్రచారంలో భాగంగా ఇటీవలే నాగార్జున సాగర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి నేరుగా తన ఫామ్‌హౌజ్‌కే వెళ్లిపోయారు. ఆ తర్వాతి నుంచే స్వల్ప లక్షణాలు కనిపిస్తుండటంతో ఇవాళ చేయించుకున్న పరీక్షల్లో కొవిడ్-19 పాజిటివ్ (COVID-19 positive) అని తేలింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News