COVID-19 బారిన పడిన వారిలో 70% కిపైగా Patients 40 ఏళ్లకు పైబడిన వారే: ICMR

Coronavirus second wave: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,73,810 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి.  ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2021, 06:25 PM IST
  • కరోనావైరస్ సెకండ్ వేవ్‌లో, ఫస్ట్ వేవ్‌లో కామన్‌గా ఉన్న అంశాలేంటి ?
  • ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ఏం చెబుతున్నారు ?
  • COVID-19 treatment గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా (AIIMS Director Dr Randeep Guleri).
COVID-19 బారిన పడిన వారిలో 70% కిపైగా Patients 40 ఏళ్లకు పైబడిన వారే: ICMR

Coronavirus second wave: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,73,810 కోవిడ్-19 కేసులు వెలుగుచూశాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనావైరస్ సెకండ్ వేవ్ గురించి మాట్లాడుతూ.. గతేడాది కరోనావైరస్ వ్యాపించినప్పుడైనా, ప్రస్తుత సెకండ్ వేవ్‌లో అయినా COVID-19 బారినపడిన వారిలో 40 ఏళ్లకుపైబడిన వారి సంఖ్యే 70 శాతానికిపైగా ఉంది అని అన్నారు.   

''కరోనావైరస్ సోకిన తొలి రోజే స్టెరాయిడ్స్ (Steroids) ఇచ్చి ప్రయోజనం లేదని, కరోనా తీవ్రత ఓ మోస్తరు నుంచి అధికమవుతున్న దశలో లేదా ఆక్సీజన్ లెవెల్స్ పడిపోతున్నప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తేనే ఫలితం ఉంటుంది'' అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ''కరోనావైరస్ సోకిన తర్వాత తొలి దశలో కానీ లేదా ఆలస్యంగా కానీ భారీ మోతాదులో కొవిడ్-19 పేషెంట్స్‌కి మెడిసిన్ (COVID-19 medicines) ఇవ్వడం ప్రమాదకరం అవుతుంది'' అని గులేరియా పేర్కొన్నారు. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ వ్యాఖ్యలు చేశారు. 

Also read : దేశవ్యాప్తంగా Lockdown విధిస్తారా ? క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి Nirmala Sitharaman

ఇదిలావుంటే, మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ (Coronavirus second wave) విజృంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీనే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని మమతా బెనర్జి (Mamata Banerjee) ఆరోపించారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News