Revanth Reddy: పదవి నుంచి దించేందుకు కేసీఆర్‌తో కుమ్మక్కైన మా పార్టీ నేతలు.. కన్నీటి పర్యంతమైన రేవంత్

Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రెస్‌‌మీట్ సంచలనంగా మారింది. ఆవేశంగా మాట్లాడే రేవంత్ ఈసారి ఆవేదనకు లోనయ్యారు. పీసీసీ పదవి నుంచి దించేందుకు సొంత పార్టీ నేతలు కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని ఆవేదన చెందారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 20, 2022, 11:38 PM IST
Revanth Reddy: పదవి నుంచి దించేందుకు కేసీఆర్‌తో కుమ్మక్కైన మా పార్టీ నేతలు.. కన్నీటి పర్యంతమైన రేవంత్

మునుగోడు ఉపఎన్నికల నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉద్వేగంగా మాట్లాడటమే కాకుండా..పీసీసీ పదవి నుంచి దించేందుకు సొంతపార్టీ నేతలు కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని కుండబద్దలు కొట్టారు. కేవలం పీసీసీ పదవి కోసం తనను ఒంటరివాడిని చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

రేవంత్ రెడ్డి మాటల్లో...

పీసీసీ పదవి నుంచి దించేందుకు మా పార్టీ నేతల కుట్ర

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించి..రేవంత్ రెడ్డిని పీసీసీ పదవి నుంచి తొలగించాలనే కుట్ర జరుగుతోంది. కార్యకర్తలు, అభిమానులు ప్రజలు ఇది గమనించాలి. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నందునే కాంగ్రెస్ బలహీనపడిందంటూ ప్రజల్లో చెడ్డపేరు తెచ్చేందుకు సొంతపార్టీ నేతలు కేసీఆర్‌తో కలిసి కుట్ర చేస్తున్నారు. త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి. లాఠీ తూటాలకైనా, తుపాకి గుండ్లకైనా నేను సిద్ధంగా ఉన్నా..ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తాను. ఈ పదవి సోనియాగాంధీ ఇచ్చిన అవకాశం. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు. పీసీసీ పదవి వచ్చినప్పటి నుంచి నేను ఒంటరివాడినయ్యాను. కేసీఆర్, బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.

నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకే..

నన్ను ఒంటరి వాడిని చేశారు, పీపీసీ పదవి కోసం నాపై ఇంత కక్ష ఎందుకు, నన్ను అభిమానించే కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు నా మనసులో బాధ చెబుతున్నా. నన్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చంపేందుకు బీజేపీ, కేసీఆర్ కలిసి కుట్ర పన్నుతున్నారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్, అమిత్ షా కలిసి ఆడుతున్న డ్రామాలో భాగమే ఈ మునుగోడు ఉపఎన్నిక. సీఆర్పీఎఫ్ బలగాలతో మునుగోడును చుట్టి..ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం..మునుగోడుకు రండి..పార్టీని కాపాడుకుందాం. దివిసీమలా మనరాష్ట్రం కాకూడదు. లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యదక్షులు ప్రాణాలిచ్చే కార్యకర్తలు మునుగోడుకు రండి.. పార్టీని కాపాడుకుందాం.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి తన స్వభావానికి విరుద్ధంగా ఆవేదనగా, ఉద్వేగభరితంగా మాట్లాడటం, ఒంటరివాడినయ్యానంటూ పదే పదే చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం పీసీసీ పదవి కోసం సొంతపార్టీ నేతలు కేసీఆర్‌తో కుమ్మక్కవడం, ఆఖరికి మునుగోడులో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కూడా వెనుకాడటం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు.

Also read: Munugode Bypoll: ఓట్ల కోసం కోటి తిప్పలు.. యాదాద్రిలో మునుగోడు ఓటర్లకు స్పెషల్ దర్శనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News